ఈ యేటి మేటి సునీల్ చెత్రి
* వరుసగా రెండో ఏడాది అవార్డు
* ఏఐఎఫ్‌ఎఫ్ వార్షిక పురస్కారాలు
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రెండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఐ-లీగ్‌లో తను బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తరఫున ఆడి ఈ ఏడాది 14 గోల్స్ సాధించాడు. ఈ అవార్డు కింద చెత్రికి ట్రోఫీతో పాటు రూ.2 లక్షల బహుమతి లభించనుంది. మరోవైపు ‘మహిళల ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’గా బాలా దేవి ఎంపికైంది.
కోచ్‌గా కాన్‌స్టాంటైన్: భారత జట్టు ఫుట్‌బాల్ చీఫ్ కోచ్‌గా స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ ఎంపికయ్యారు. వచ్చే వారం అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తారు. గతంలో స్టీఫెన్ 2002 నుంచి 2005 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు.
171కి దిగజారిన ర్యాంకు: ఐఎస్‌ఎల్ సూపర్ సక్సెస్‌తో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకర్షించిన భారత్... ఫిఫా ర్యాంకింగ్స్‌లో మాత్రం తొలిసారిగా 171వ ర్యాంకుకు దిగజారింది. మొత్తం 209 దేశాలకు ర్యాంకింగ్‌ను ప్రకటించారు.