indian football captain sunil chhetri
-
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్‌లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్‌పై ముంబై గెలుపు
ముంబై: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5-1తో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీని చిత్తు చేసింది. ముంబై తరఫున చెత్రి (25, 40, 48వ. ని.), నోర్డి (51వ ని.), బెర్టిన్ (87వ ని.) గోల్స్ చేయగా... బోతాంగ్ (29వ ని.) నార్త్ ఈస్ట్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ సీజన్లో ఇది రెండో హ్యాట్రిక్. చెన్నైయిన్‌కు చెందిన స్టీవెన్ మెండోజా... గోవాపై తొలి హ్యాట్రిక్ సాధించాడు. 10 పాయింట్లతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. ఢిల్లీ డైనమోస్‌తో తలపడుతుంది. -
చెత్రికి రూ.1.20 కోట్లు
♦ కోటి క్లబ్లో లింగ్డో ♦ ఐఎస్ఎల్ ఆటగాళ్ల వేలం ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు చెందిన ముంబై సిటీ ఎఫ్‌సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్‌బాల్‌లో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న 30 ఏళ్ల చెత్రి కోసం ముంబై, ఢిల్లీ జట్లు మాత్రమే పోటీపడ్డాయి. ఓవరాల్‌గా పది మంది భారత ఆటగాళ్లు ఆక్షన్‌లో పాల్గొన్నారు. అయితే యుగెన్సన్ లింగ్డో, రినో ఆంటోల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దీంతో వారి ధర అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా సెంట్రల్ మిడ్‌ఫీల్డర్ లింగ్డో కనీస ధర కేవలం రూ.27.50 లక్షలే అయినా పుణే సిటీ ఎఫ్‌సీ మూడు రెట్లు అధికంగా రూ.1 కోటీ 5 లక్షలు వెచ్చించింది. గత సీజన్ ఐ-లీగ్‌లో తను అద్భుత ప్రదర్శన చేయడంతో ఏకంగా ఆరు జట్లు అతడి కోసం పోటీపడ్డాయి. చివరకు పుణే దక్కించుకుంది. ఇక డిఫెండర్ ఆంటోను డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా రూ.90 లక్షలకు తీసుకుంది. అతడి కనీస ధర అందరికన్నా తక్కువగా రూ.17 లక్షల 50 వేలు. ఇలాగే రూ.39 లక్షల ధర కలిగిన తోయి సింగ్ కోసం కూడా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ముంబై జట్లు పోటీ పడినా చెన్నైయిన్ ఎఫ్‌సీ రూ.86 లక్షలకు దక్కించుకుంది. మొత్తంగా ఈ వేలంలో కోల్‌కతా, చెన్నైయిన్, పుణే, ఢిల్లీ జట్లు ఇద్దరు ఆటగాళ్లను, ముంబై, నార్త్ ఈస్ట్ ఒక్కో ఆటగాడిని తీసుకోగా గోవా ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ ఒక్క ఆటగాడిని కూడా గెల్చుకోలేకపోయాయి. అన్ని జట్లు కలిపి వేలంలో రూ.7.22 కోట్లు ఖర్చు చేశాయి. నా ధరపై సంతృప్తిగానే ఉన్నాను: చెత్రి వేలంలో తనకు లభించిన ధరపై అసంతృప్తి లేదని స్ట్రయికర్ సునీల్ చెత్రి అన్నాడు. ‘13 ఏళ్లుగా నేను ఫుట్‌బాల్ ఆడుతున్నాను. డబ్బు నాకు తగినంతగా ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదు. ఇప్పటికే ప్రపంచమంతా ఆడాను కానీ ముంబైలో ఆడలేదు’ అని చెత్రి అన్నాడు. మరోవైపు ఇంత తక్కువ ధరకు చెత్రిని కొనుగోలు చేస్తామని అనుకోలేదని ముంబై యజమాని రణబీర్ కపూర్ సంతోషం వ్యక్తం చేశాడు. -
ఈ యేటి మేటి సునీల్ చెత్రి
* వరుసగా రెండో ఏడాది అవార్డు * ఏఐఎఫ్ఎఫ్ వార్షిక పురస్కారాలు న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రెండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఐ-లీగ్‌లో తను బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తరఫున ఆడి ఈ ఏడాది 14 గోల్స్ సాధించాడు. ఈ అవార్డు కింద చెత్రికి ట్రోఫీతో పాటు రూ.2 లక్షల బహుమతి లభించనుంది. మరోవైపు ‘మహిళల ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’గా బాలా దేవి ఎంపికైంది. కోచ్‌గా కాన్స్టాంటైన్: భారత జట్టు ఫుట్‌బాల్ చీఫ్ కోచ్‌గా స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఎంపికయ్యారు. వచ్చే వారం అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తారు. గతంలో స్టీఫెన్ 2002 నుంచి 2005 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. 171కి దిగజారిన ర్యాంకు: ఐఎస్ఎల్ సూపర్ సక్సెస్‌తో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకర్షించిన భారత్... ఫిఫా ర్యాంకింగ్స్‌లో మాత్రం తొలిసారిగా 171వ ర్యాంకుకు దిగజారింది. మొత్తం 209 దేశాలకు ర్యాంకింగ్‌ను ప్రకటించారు.