పారిస్: ఒలింపిక్స్‌లో తమ కాంస్య పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో ‘పారిస్’కు వచ్చిన భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (24వ ని.లో), వివేక్ సాగర్ ప్రసాద్ (34వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు స్యామ్ లేన్ (8వ ని.లో), సిమోన్ చైల్డ్ (53వ ని.లో) ఒక్కో గోల్ అందించారు.
సాత్విక్ జోడీ బోణీ
బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అలవోక విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–17, 21–14తో లుకాస్ కొర్వీ–రోనన్ లాబర్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. మొదటిసారి ఒలింపిక్స్ ఆడుతున్న యువ షట్లర్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ తొలి రౌండ్‌లో 21–8, 22–20తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై గెలిచాడు.
హర్మీత్ విజయం
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ ముందంజ వేశాడు. ప్రాథమిక రౌండ్ మ్యాచ్‌లో హర్మీత్ 11–7, 11–9, 11–5, 11–5తో జైద్ అబో యమన్ (జొర్డాన్)పై విజయం సాధించాడు. తదుపరి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రాన్ (ఫ్రాన్స్)తో హర్మీమత్ తలపడతాడు.
రెపిచేజ్‌కు బాలరాజ్
భారత రోవర్ బాలరాజ్ పన్వర్ రెపిచేజ్ దశకు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ హీట్–1లో బాలరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోవర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. రెపిచేజ్ రౌండ్లో రాణిస్తేనే బాలరాజ్ ముందంజ వేస్తాడు.
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు ్ఠ ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్‌ఎస్ ప్రణయ్ ్ఠ ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచి
షూటింగ్
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).
రోయింగ్
పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).
టేబుల్ టెన్నిస్
మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ ్ఠ క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా X అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ X డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).
స్విమ్మింగ్
పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).
ఆర్చరీ
మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్ )X ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment