నేడు తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ‘ఢీ’
రాత్రి గం. 9 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత పురుషుల హాకీ జట్టు అదే జోరును ‘పారిస్’లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. నేడు జరిగే పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా స్థాయికి తగ్గట్టు ఆడితే శుభారంభం చేస్తుంది. పూల్ ‘బి’లోనే డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆ్రస్టేలియా, అర్జెంటీనా, ఐర్లాండ్ జట్లున్నాయి. మరోవైపు పూల్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ జట్లున్నాయి.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–4లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు వరుసగా అర్జెంటీనా (29న), ఐర్లాండ్ (30న), బెల్జియం (ఆగస్టు 1న), ఆ్రస్టేలియా (ఆగస్టు 2న) జట్లతో ఆడుతుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించిన మేటి గోల్‌కీపర్ శ్రీజేశ్‌కు వీడ్కోలు కానుకగా పతకం అందించాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది.
అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 105 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా...30 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. 17 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. శనివారమే జరిగే ఇతర గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనా... బెల్జియంతో ఐర్లాండ్ తలపడతాయి. గ్రూప్ ‘ఎ’లో బ్రిటన్‌తో స్పెయిన్; దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్; జర్మనీతో ఫ్రాన్స్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment