పారిస్: ఓటమి అంచుల్లో నుంచి భారత పురుషుల హాకీ జట్టు గట్టెక్కి ‘డ్రా’తో ఊపిరి పీల్చుకుంది. సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 22వ నిమిషంలో లుకాస్ మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని 2–0కు పెంచుకునే అవకాశం అర్జెంటీనాకు వచ్చిం ది.
కానీ పెనాల్టీ స్ట్రోక్‌ను మైసో కసెల్లా వృథా చేశాడు. స్కోరును సమం చేసేందుకు భారత్ శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. నిలకడగా పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. కానీ వాటిని లక్ష్యానికి చేర్చడంలో విఫలమైంది. అయితే మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్‌కు 59వ నిమిషంలో తొమ్మిదో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును సమం చేయడంతోపాటు భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది.
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
హాకీ
పురుషుల పూల్ ‘బి’ మ్యాచ్: భారత్ X ఐర్లాండ్
(సాయంత్రం గం. 4:45 నుంచి).
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకిత భకత్ X వియోలెటా (పోలాండ్) (సాయంత్రం గం. 5:15 నుంచి), భజన్ కౌర్ X సిఫా (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: బొమ్మదేవర ధీరజ్ X ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్) (రాత్రి గం. 10:45 నుంచి).
బాక్సింగ్
పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్: అమిత్ పంఘాల్ X పాట్రిక్ చిన్‌యెంబా (జింబాబ్వే) (రాత్రి గం. 7:15 నుంచి). మహిళల 57 కేజీల మ్యాచ్: జైస్మిన్ లంబోరియా X నెస్థీ పెటెసియా (ఫిలిప్పీన్స్) (రాత్రి గం. 9:25 నుంచి). మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్: ప్రీతి పవార్ X యెని మెర్సెలా (కొలంబియా) (అర్ధరాత్రి గం. 1.20 నుంచి).
బ్యాడ్మింటన్
పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X అలి్ఫయన్ ఫజర్–మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో X సెట్యానా మాపసా–ఏంజెలా యూ (ఆ్రస్టేలియా) (సాయంత్రం గం. 6:20 నుంచి).
షూటింగ్
ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్: పృథీ్వరాజ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరు: భారత్ (మనూ భాకర్–సరబ్‌జోత్ సింగ్) ్ఠ దక్షిణ కొరియా (జిన్ ఓయె–లీ వన్‌హో) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment