
పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు... ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై కష్టపడి గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (5వ ని.లో), మన్‌దీప్ సింగ్ (11వ ని.లో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (24వ ని.లో), అభిషెక్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
కొరియా తరఫున మన్‌జె జుంగ్ (17వ, 20వ, 42వ ని.లో) ‘హ్యాట్రిక్’తో మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో జపాన్ 3–2తో చైనాను ఓడించింది. భారత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment