భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియానుంచి భారత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ వరకు వెళ్లింది.
పురుషుల తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 18–21, 21–16, 21–19తో జీన్ హ్యోక్ జీన్‌పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్‌లో టాప్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్ మిన్ హ్యూక్ – స్యూంగ్ జే సంచలన విజయం సాధించారు.
రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–7, 2–19తో లీ యూన్ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల 16–21, 11–21తో కిమ్ వోన్ హో – సంగ్ సియూంగ్ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత కిడాంబి శ్రీకాంత్‌పై పడింది. తొలి గేమ్‌ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్‌పై శ్రీకాంత్ గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment