ఆసియాక్రీడల మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్‌ను 8వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 51 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
అనంతరం 52 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(20 నాటౌట్),షెఫాలీ వర్మ(17) పరుగులతో రాణించారు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) జరగనున్న ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
చదవండి: Asian Games 2023: పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్
Comments
Please login to add a commentAdd a comment