న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ పేరును... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’కు నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. మరోవైపు మిడ్‌ఫీల్డర్ చింగ్లెన్‌సనా సింగ్, ఫార్వర్డ్ ఆకాశ్ దీప్ సింగ్... మహిళా జట్టు డిఫెండర్ దీపిక పేర్లను ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించారు. ఆర్పీ సింగ్, సందీప్ కౌర్ పేర్లను జీవితసాఫల్య పురస్కారం ‘ధ్యాన్‌చంద్’ అవార్డుకు... బల్జీత్ సింగ్, బీఎస్ చౌహాన్, రమేశ్ పథానియా పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు నామినేట్ చేశారు.
2006లో దక్షిణాసియా క్రీడల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన శ్రీజేశ్ ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్లకు శ్రీజేశ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. రెండు ప్రపంచకప్‌లలో, రెండు ఒలింపిక్స్‌లో కూడా అతను పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment