కామన్‌వెల్త్ క్రీడల్లో రికార్డు.. ఘనాపై భారీ విజయం సాధించిన టీమిండియా | CWG 2022: Indian Mens Hockey Team Trounce Ghana 11 0 In Opening Match | Sakshi
Sakshi News home page

CWG 2022 Mens Hockey: కామన్‌వెల్త్ క్రీడల్లో రికార్డు.. ఘనాపై భారీ విజయం సాధించిన భారత హాకీ జట్టు 

Published Mon, Aug 1 2022 8:19 AM | Last Updated on Mon, Aug 1 2022 8:25 AM

CWG 2022: Indian Mens Hockey Team Trounce Ghana 11 0 In Opening Match - Sakshi

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు విజయం నమోదు చేసింది. పూల్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే. 1998 గేమ్స్‌లో ట్రినిడాడ్‌పై భారత్‌ 10–1తో నెగ్గింది.

ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో ప్రత్యర్ధిపై విరుచుకుపడ్డాడు. మరో ఆటగాడు జుగ్‌రాజ్ సింగ్‌ కూడా రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. భారత్‌ తర్వాతి మ్యాచ్‌లో పూల్‌-బి టాపర్ ఇంగ్లండ్‌తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement