న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుపై విజయం సాధించడంలో టీమిండియా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది.
జర్మనీ తరఫున మెర్ట్‌జెన్స్ (4వ నిమిషంలో), విండ్‌ఫెడర్ (30వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఏకంగా ఏడు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ కూడా వచ్చాయి. కానీ వీటిని భారత జట్టు గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. మరోవైపు జర్మనీ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్‌లు రాగా, ఒక దానిని గోల్‌గా మలిచింది.
Comments
Please login to add a commentAdd a comment