
పోరాడి ఓడిన భారత్
స్టెలెన్‌బోష్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3తో జర్మనీ చేతిలో పోరాడి ఓడింది. భారత్‌కు సునీత లాక్రా తొలి గోల్ అందించింది. రెండో క్వార్టర్‌లో జర్మనీ క్రీడాకారిణి లిసా మారి షుట్జ్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేసింది. అయితే 29వ నిమిషంలో భారత ప్లేయర్ అనురాధ దేవి ఫీల్డ్ గోల్ సాధించినా... ఆ వెంటనే క్రుగర్ (జర్మనీ) పెనాల్టీని గోల్‌గా మల్చడంతో ఇరుజట్ల స్కోరు 2-2తో సమమైంది. ఇక డ్రా అనుకుంటున్న తరుణంలో క్రూగర్ రెండో పెనాల్టీని గోల్‌గా మలిచి జర్మనీని 3-2తో గెలిపించింది.