సావ్‌పాలో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో వెనిజులాపై గెలుపొందింది. బ్రెజిల్ తరఫున మార్కినోస్ (23వ నిమిషంలో), నేమార్ (64వ నిమిషంలో), గాబ్రియెల్ (89వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు.
అనంతరం గ్రూప్ ‘బి’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ కొలంబియా 1–0తో ఈక్వెడార్‌పై నెగ్గింది. కొలంబియా ఆటగాడు కార్డోనా (42వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment