Copa America football tournament
-
29వసారి ఫైనల్లోకి అర్జెంటీనా
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 29వసారి ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1 తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (7వ ని.లో), కొలంబియా తరఫున దియాజ్ (61వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్స్ చేయకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడుతుంది. కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా 14 సార్లు విజేతగా నిలిచింది. చివరిసారి ఆ జట్టు 1993లో టైటిల్ గెల్చుకుంది. -
Copa America 2021: బ్రెజిల్ శుభారంభం
సావ్‌పాలో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో వెనిజులాపై గెలుపొందింది. బ్రెజిల్ తరఫున మార్కినోస్ (23వ నిమిషంలో), నేమార్ (64వ నిమిషంలో), గాబ్రియెల్ (89వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. అనంతరం గ్రూప్ ‘బి’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ కొలంబియా 1–0తో ఈక్వెడార్‌పై నెగ్గింది. కొలంబియా ఆటగాడు కార్డోనా (42వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
గెలిచి నిలిచిన పెరూ
వెనిజులాపై 1-0తో విజయం కోపా అమెరికా కప్ వాల్పరైసో (చిలీ): కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ లో పెరూ జట్టు తమ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో ఓడిన ఈ జట్టుకు గురువారం వెనిజులాతో జరిగిన కీలక పోరులో వెటరన్ స్ట్రయికర్ క్లాడియో పిజారో (72వ ని.) కీలక విజయాన్ని అందించాడు. దీంతో గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పెరూ 1-0తో నెగ్గింది. ఈ ఫలితంతో ఈ గ్రూపు నుంచి క్వార్టర్స్‌కు చేరే విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభించినట్టయ్యింది. నాలుగు జట్లు మూడేసి పాయింట్లతో ఉన్నాయి. ఇక తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో కొలంబియాతో పెరూ; వెనిజులాతో బ్రెజిల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రారంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత వెనిజులా ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. దూకుడుగా ఆడే క్రమంలో 30వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గెరీరోను ప్రమాదకరంగా ఢీకొనడంతో వెనిజులా డిఫెండర్ అమోరెబీటా రెడ్‌కార్డ్‌కు గురై మైదానం వీడాడు. దీంతో 10 మందితోనే ఆ జట్టు ఆడాల్సి రావడంతో లయ దెబ్బతింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్న పెరూ విజృంభించింది. మ్యాచ్ మరో 18 నిమిషాల్లో ముగుస్తుందనగా పిజారో కొట్టిన షాట్ గోల్ పోస్టు పై నెట్‌కి తాకుతూ లోనికి చేరడంతో జట్టు సంబరాల్లో మునిగింది. కోపా అమెరికా కప్‌లో నేడు ఉరుగ్వే ఁ పరాగ్వే రాత్రి గం. 12.30 నుంచి అర్జెంటీనా ఁ జమైకా తెల్లవారుజామున గం. 3.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం