
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా ఒక స్థానం పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బ్రెజిల్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. రన్నరప్ ఫ్రాన్స్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది.
గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన బెల్జియం రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. మూడో స్థానం పొందిన క్రొయేషియా ఐదు స్థానాలు పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా గుర్తింపు పొందిన మొరాకో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. జపాన్ 20వ ర్యాంక్‌తో ఆసియా నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. భారత్ 106వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment