World football rankings
-
FIFA rankings: రెండో ర్యాంక్‌లో అర్జెంటీనా
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా ఒక స్థానం పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బ్రెజిల్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. రన్నరప్ ఫ్రాన్స్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన బెల్జియం రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. మూడో స్థానం పొందిన క్రొయేషియా ఐదు స్థానాలు పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా గుర్తింపు పొందిన మొరాకో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. జపాన్ 20వ ర్యాంక్‌తో ఆసియా నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. భారత్ 106వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. -
250 దరఖాస్తులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రస్తుతం మన జట్టు ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 103వ స్థానంలో ఉంది. అయినా సరే భారత జట్టు కోచ్ పదవిపై మాత్రం ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కోచ్ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 250 మంది దీని కోసం ముందుకు రావడం విశేషం. మార్చి 29న ఈ ప్రక్రియ ముగిసింది. వీరిలో యూరోప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆసియా కప్‌లో భారత్ నాకౌట్ దశకు చేరడంలో విఫలం కావడంతో కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి కోచ్ స్థానం ఖాళీగా ఉంది. దరఖాస్తు చేసుకున్నవారిలో ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్‌లలో కోచ్‌లుగా వ్యవహరించినవారు ఉన్నారు. ఈ జాబితాలో గియోవానీ బియాసీ (ఇటలీ), హాకెన్ ఎరిక్సన్ (స్వీడన్), రేమండ్ డామ్‌నెక్ (ఫ్రాన్స్), స్యామ్ అలార్డీస్ (ఇంగ్లండ్) తదితరులు ఉన్నారు. అయితే బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు అద్భుత విజయాలు అందించిన ఆల్బర్ట్ రోకా కోచ్ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పేరు ప్రఖ్యాతులకంటే భారత జట్టు అవసరాలకు అనుగుణంగా కోచ్‌ను ఎంపిక చేస్తామని ఏఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ ఇప్పటికే చెప్పారు. -
దిగజారిన భారత ర్యాంకు
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి వందకు దిగువకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏకంగా 10 స్థానాల్ని కోల్పోయి 107వ ర్యాంకుకు దిగజారింది. మే తర్వాత టాప్–100 ర్యాంకు నుంచి పడిపోవడం ఇదే తొలి సారి. జూలైలో 96వ స్థానానికి ఎగబాకడం ద్వారా భారత్ తమ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.