రావల్పిండి: ఊహించిన ఫలితమే వచ్చింది. తొలి నాలుగు రోజులు వర్షం అంతరాయం కలిగించిన పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చివరిరోజు ఎండ కాయడంతో పూర్తి ఓవర్లు సాధ్యమయ్యాయి. ఓవర్‌నైట్ స్కోరు 282/6తో ఆట చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఆరు వికెట్లకు 308 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డి సిల్వా (102 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది.
ఓపెనర్ ఆబిద్ అలీ (109 నాటౌట్; 11 ఫోర్లు), బాబర్ ఆజమ్ (102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలు చేశారు. ఈ శతకంతో ఆబిద్ అలీ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల క్రికెట్‌లో టెస్టు, వన్డే అరంగేట్రం మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన తాను ఆడిన తొలి వన్డేలో ఆబిద్ అలీ 112 పరుగులు చేశాడు. పురుషుల క్రికెట్ కంటే ముందుగా మహిళల క్రికెట్‌లో ఈ ఘనత నమోదైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎనిడ్ బ్లాక్‌వెల్ తాను ఆడిన తొలి టెస్టు (1968లో ఆ్రస్టేలియాపై 113)లో, తొలి వన్డేలో (1973లో ఇంటర్నేషనల్ ఎలెవన్‌పై 101 నాటౌట్) సెంచరీలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment