
కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 64/3తో ఆట కొనసాగించిన లంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (74) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, దిల్‌రువాన్ పెరీరా (48) రాణించాడు. పాక్ యువ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది 77 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, మరో పేసర్ అబ్బాస్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. ఆబిద్ అలీ (32 బ్యాటింగ్), షాన్ మసూద్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment