కరాచీ: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో చివరి రోజు మరో మూడు వికెట్లు తీస్తే పాకిస్తాన్ విజయం ఖాయమవుతుంది. 476 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ ఒశాడ ఫెర్నాండో అజేయ శతకం (102 బ్యాటింగ్; 13 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 395/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 131 ఓవర్లలో 3 వికెట్లకు 555 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ అజహర్ అలీ (118; 13 ఫోర్లు), బాబర్ ఆజమ్ (100 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) శతకాలతో చెలరేగారు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పాక్ తరఫున టాప్–4 బ్యాట్స్‌మెన్ సెంచరీలు (ఆబిద్, మసూద్) చేయడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో ఈ ఘనత నమోదవ్వడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో భారత్ (2007లో ఢాకాలో బంగ్లాదేశ్‌పై; దినేశ్ కార్తీక్, వసీమ్ జాఫర్, ద్రవిడ్, సచిన్ సెంచరీలు) ఈ ఘనతను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment