లీప్‌జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్‌లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి.
అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్‌ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్‌ను ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్‌లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment