ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ముంబై, పుణే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లకు ఇది మూడో ‘డ్రా’ కావడం గమనార్హం. ఈ ఏడాది ఈ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో గోల్ నమోదు కాకపోవడం ఇది రెండోసారి మాత్రమే. గతనెల 10న కేరళ బ్లాస్టర్స్, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ గోల్స్ నమోదు కాలేదు. ప్రస్తుతం గోవా, పుణే జట్లు 15 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో అట్లెటికో డి కోల్‌కతా జట్టు ఆడుతుంది.