అదే నా విజన్‌: నీతా అంబానీ | Nita Ambani To Popularise Football In India | Sakshi
Sakshi News home page

అదే నా విజన్‌: నీతా అంబానీ

Published Sat, Aug 31 2019 1:52 PM | Last Updated on Sat, Aug 31 2019 2:04 PM

Nita Ambani To Popularise Football In India - Sakshi

ముంబై:  దేశంలో లక్షల సంఖ్యలో చిన్నారులను తమకు నచ్చిన క్రీడలకు పరిచయం చేయడమే తన విజన్‌ అని ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఎస్‌డీఎల్‌) చైర్‌పర్సన్‌ నీతా అంబానీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఐఎస్‌ఎల్‌ (ఇండియన్‌ సూపర్‌ లీగ్‌)వేదికను ఉపయెగించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిలో భాగంగా అండర్‌-17, అండర్‌-12 స్థాయిలో అమ్మాయిలకు టోర్నీలు నిర్వహించేందుకు తలపెట్టినట్లు నీతా పేర్కొన్నారు.  2019-20 సీజన్‌లో అండర్‌-17, అండర్‌-12 స్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు. అండర్‌-17 గర్ల్స్‌ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయని, ఇందులో వందకు  మందికి పైగా క్రీడాకారిణులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు.

2020లో అండర్‌-17 మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ‍్యం ఇవ్వనున్న నేపథ్యంలో అప‍్పటిలోగా ప్లేయర్ల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఎఫ్‌ఎస్‌డీఎల్‌ పని చేయనున్నట్లు తెలిపారు. మరొకవైపు తొలి విడతలో కేవలం మూడు రాష్ట్రాల చిల్డ్రన్స్‌ లీగ్‌లు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరిస్తామని నీతా పేర్కొన్నారు.

ఈ మేరకు శుక్రవారం ముంబైలో జరిగిన సమావేశంలో నీతా అంబానీతో పాటు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)క్లబ్‌ యాజమానుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అక్షయ్‌ టాండన్‌, విజయ్‌ మద్దూరి, పార్థ్‌ జిందాల్‌, సంజయ్‌ గుప్తా, చిరంజీవి, జాన్‌ అబ్రహం, ప్రపుల్‌  పటేల్‌, అభిషేక్‌ బచ్చన్‌, రణబీర్‌ కపూర్‌, సంజయ్‌ గోయెంకా, అనిల్‌ శర్మ, చాణక్య చౌదరిలు హాజరయ్యారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement