wimble don
-
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
వింబుల్డన్ టోర్నమెంట్ రద్దు
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా... ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్టీసీ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్ టోర్నీని 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు లేవని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి. -
హై హై... హలెప్
ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి చేజార్చుకుంది. సహజశైలిలో, స్థాయికి తగ్గట్టు ఆడితే విజయం ఖాయమనుకున్న చోట ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో సెరెనాతో ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే నెగ్గిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ వింబుల్డన్ వేదికపై తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాపై కేవలం 56 నిమిషాల్లో అదీ నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగురవేసిన హలెప్ కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. లండన్: మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన సెరెనా విలియమ్స్‌కు మళ్లీ ఆశాభంగమైంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా స్టార్ మరో టైటిల్‌తో మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలని ప్రయత్నించి విఫలమైంది. గత ఏడాది వింబుల్డన్‌లో, యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న సెరెనా ఈ యేడు కూడా వింబుల్డన్ ఫైనల్లో ఓటమి రుచి చూసింది. గత సంవత్సరం తుది పోరులోఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) షాక్ ఇవ్వగా... ఈసారి సిమోనా హలెప్ (రొమేనియా) ఆ పని చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ.10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే దూకుడు... గతంలో 37 ఏళ్ల సెరెనాపై ఒక్కసారి మాత్రమే నెగ్గిన 27 ఏళ్ల హలెప్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో, మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ తన సర్వీస్‌లను కాపాడుకొని 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన హలెప్ తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సెరెనా పుంజుకుంటుందని ఆశించినా హలెప్ జోరు ముందు ఆమె తేలిపోయింది. ఐదో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ ఎనిమిదో గేమ్‌లోనూ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను. – సిమోనా హలెప్ -
సూపర్ సెరెనా
వింబుల్డన్ ఫైనల్లో అమెరికా స్టార్ టైటిల్ పోరులో ముగురుజాతో అమీతుమీ రష్యా అందాల తార మరియా షరపోవాపై గత 11 ఏళ్లుగా చూపెడుతున్న ఆధిపత్యాన్ని.. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్‌లోనూ కొనసాగించింది. బలమైన సర్వీస్‌లు, పటిష్టమైన బేస్‌లైన్ ఆటతీరుతో పాటు తిరుగులేని ఏస్‌లతో రష్యన్ స్టార్‌ను కట్టిపడేసినా సెరెనా.. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ముగురుజాతో సెరెనా తలపడుతుంది. లండన్: చిరకాల ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించిన అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-2, 6-4తో షరపోవాపై విజయం సాధించింది. దీంతో 25వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి అడుగుపెట్టిన అరుదైన మైలురాయిని సెరెనా సొంతం చేసుకుంది. గతంలో వరుసగా 16 మ్యాచ్‌ల్లో షరపోవాను ఓడించిన అమెరికా స్టార్ ఆ సంఖ్యను 17కు పెంచుకుంది. గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా సంధించిన 13 ఏస్‌లకు షరపోవా సమాధానం చెప్పలేకపోయింది. తొలిసెట్లో రెండు, నాలుగు, ఆరు, ఎనిమిదో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా... మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయింది. ఇక రెండోసెట్లో తొలిగేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా... రెండో గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయింది. మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కోల్పోయినా.. నాలుగో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో అమెరికా స్టార్ రెండు గేమ్‌లను గెలుచుకోవడంతో స్కోరు 4-2 అయ్యింది. ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. 8వ గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకుని సెరెనా నెగ్గింది. 19 ఏళ్ల తర్వాత ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి తొలి సెమీస్‌లో 20వ సీడ్ ముగురుజా 6-2, 3-6, 6-3తో 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్)పై నెగ్గింది. దీంతో 19 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1996లో ఆరంటా సాంచెజ్ వికారియో ఈ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రద్వాన్‌స్కాతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముగురుజా ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగింది. తొలిసెట్లో 12 విన్నర్లు సంధిస్తే.. పోలెండ్ ప్లేయర్ నాలుగింటితో సరిపెట్టుకుంది. రెండో, ఐదో గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను బ్రేక్ చేసి ముగురుజా తొలిసెట్‌ను గెలుచుకుంది. రెండోసెట్ తొలి గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేయడంతో పాటు తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని ముగురుజా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌ను రద్వాన్‌స్కా, నాలుగో గేమ్‌ను ముగురుజా కాపాడుకోవడంతో స్కోరు 3-1గా మారింది. ఈ దశలో రద్వాన్‌స్కా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండోసెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో బలమైన సర్వీస్‌లతో చెలరేగిన ముగురుజా 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడో గేమ్‌లో ముగురుజా సర్వీస్ నిలబెట్టుకోగా, తర్వాతి గేమ్‌ను రద్వాన్‌స్కా కాపాడుకోవడంతో స్కోరు 5-3కు వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముగురుజా తప్పులు చేసినా రద్వాన్‌స్కా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో ముగురుజా సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.