ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరంగా పారిస్ నిలిచింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ రాజధాని టోక్యో మూడో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి కేవలం ఢిల్లీ మాత్రమే టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు డేటా అనలిటిక్స్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది. 2024లో పారిస్ వరుసగా నాలుగోసారి అత్యంత ఆకర్షణీయమైన నగరంగా నిలిచింది.
మాడ్రిడ్టో, క్యోలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా ఉన్నాయి. భారత్ నుంచి ఢిల్లీ 74వ స్థానంలో నిలిచింది. 98వ స్థానంలో జెరూసలేం, 99వ స్థానంలో జుహై, 100 స్తానంలో కైరో నిలిచింది. ఆర్థిక, వ్యాపార పనితీరు, పర్యాటక పనితీరు, పర్యాటక మౌలిక సదుపాయాలు, పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత మరియు స్థిరత్వం వంటి అంశాలు ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment