ప్రపంచ కుబేరులు ఒకేవేదికపై దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత ధనవంతులు, ఎలోన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో కలిశారు. జూన్ 14 నుండి జూన్ 17 వరకు ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు వీరు హాజరయ్యారు. ఈ సందర‍్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు.
తల్లి మేయే మస్క్‌తో కలిసి టెస్లా సీఈవో మస్క్ హాజరు కాగా, ఎల్‌ఎఈఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు - ఆంటోయిన్ , అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు "కలిసి పని చేద్దాం! అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.
NEW: Elon Musk expresses his support for free speech at the Viva Technology event in Paris, France.
— Collin Rugg (@CollinRugg) June 16, 2023
It's crazy that this is a controversial take in 2023.
"We should have free speech as much as possible... We want to allow the people to express themselves."
"Free speech matters… pic.twitter.com/PGZrdmNSML
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యూరోప్ అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ జరుగుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ లీడర్‌లు, స్టార్టప్‌లు, ప్రధాన కార్పొరేషన్‌లు, పెట్టుబడిదారులను కనెక్ట్ చేయాలనేది ప్లాన్. ఈ ఈవెంట్‌లో ట్విటర్ బాస్ మస్క్, అతిపెద్ద ఫ్యాషన్ ప్రపంచం అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రధాన వక్తలుగా ఉన్నాయి.
వీరితోపాటు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సేల్స్‌ఫోర్స్ కో-ఫౌండర్ మార్క్ బెనియోఫ్, మెటా యాన్ లెకున్‌లోని వైస్‌ప్రెసిడెంట్, ఏఏ చీఫ్ ఏసైంటిస్ట్ కూడా ప్రసంగించారు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?)
కాగా ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర విలువ 236.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
Comments
Please login to add a commentAdd a comment