మెస్సీ గోల్‌ చేశాడు.. పారిస్‌ దద్దరిల్లింది | Lionel Messi Scores Maiden PSG Goal In Champions League Group | Sakshi
Sakshi News home page

Viral Video: పారిస్‌ దద్దరిల్లింది.. పీఎస్‌జీ తరఫున తొలి గోల్‌ చేసిన మెస్సీ

Published Wed, Sep 29 2021 8:26 PM | Last Updated on Wed, Sep 29 2021 8:26 PM

Lionel Messi Scores Maiden PSG Goal In Champions League Group - Sakshi

Lionel Messi Scores Maiden PSG Goal: ఛాంపియన్స్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌ సిటీతో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మేన్ (పీఎస్‌జీ) స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ గోల్‌ సాధించడంతో పారిస్‌ నగరం దద్దరిల్లింది. రెండు ద‌శాబ్దాల పాటు బార్సిలోనా క్ల‌బ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్‌జీ తరఫున త‌న తొలి గోల్‌ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్‌ తరఫున గోల్‌ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబ‌పే అందించిన అద్భుత‌మైన పాస్‌ను మెస్సీ గోల్‌గా మ‌లిచాడు. ఈ గోల్‌ను మెస్సీ.. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మాన్‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement