Goal-scoring
-
మెస్సీ గోల్ చేశాడు.. పారిస్ దద్దరిల్లింది
Lionel Messi Scores Maiden PSG Goal: ఛాంపియన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మేన్ (పీఎస్జీ) స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ గోల్ సాధించడంతో పారిస్ నగరం దద్దరిల్లింది. రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్జీ తరఫున తన తొలి గోల్ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. JUST LISTEN TO THE ROAR THAT COULD BE HEARD ALL OVER PARISNotice how Messi instantly points to Mbappé who provided the brilliant assist 🔥 pic.twitter.com/aa5n6FAtaq— mx (@MessiMX30i) September 28, 2021 తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్ తరఫున గోల్ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబపే అందించిన అద్భుతమైన పాస్‌ను మెస్సీ గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌ను మెస్సీ.. మరో స్టార్ ప్లేయర్ నెయ్మాన్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
ఒక్క గోల్‌కు రెండు పాయింట్లు
మారిన హెచ్ఐఎల్ నిబంధనలు న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్లలో పోరాటపటిమ, క్రమశిక్షణ పెంచేందుకు నిర్వాహకులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 2016 నాలుగో సీజన్ నుంచి గోల్ స్కోరింగ్‌లో కొత్త నిబంధనలు తేనున్నారు. నైపుణ్యత, వ్యూహాత్మక ఆటతీరును ప్రోత్సహించేందుకు ఫీల్డ్ గోల్స్‌కు రెండు పాయింట్లు, ఆటగాళ్లను మొరటుగా అడ్డుకోవడాన్ని తగ్గించేందుకు పెనాల్టీ స్ట్రోక్‌లకు కూడా రెండు పాయింట్లు ఇస్తున్నట్టు హెచ్ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా తెలిపారు. క్షమాపణలు చెబితేనే...: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేదని లీగ్ చైర్మన్ బాత్రా తేల్చి చెప్పారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై విజయం అనంతరం పాక్ ఆటగాళ్లు ప్రేక్షకులతో అసభ్యంగా ప్రవర్తించారు. పాక్ తమకు ఈ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తుచేశారు. క్షమాపణలు చెబితే ఆలోచిస్తామని చెప్పారు.