ప్రపంచ మార్కెట్‌లో భారత ప్రతిభ ప్రభ వెలిగిపోతుంది. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితుడైన మరికొన్ని రోజుల్లో మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా పని చేసే అవకాశం ప్రవాస భారతీయులకు దక్కింది. లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి ఆసియన్ మహిళ ఆమే కావడం గమనార్హం. 1992లో యూనిలీవర్‌లో ఫ్యాక్టరీ ఫ్లోర్ ట్రైనీగా జాయిన్ అయిన లీనా నాయర్ అంచెలంచెలుగా ఎదుగుతూ సీహెచ్‌ఆర్‌ఓ స్థాయికి చేరుకున్నారు.
ఇండియాలోని జంషెడ్‌పూర్‌లో లీనా నాయర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనిలీవర్‌లో చేరి నిర్విరామంగా 30 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేస్తూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సీహెచ్‌ఆర్‌వోగా సుమారు 1.50ల మంది ఉద్యోగుల బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఫ్యాషన్ కంపెనీ షునల్ మరింత ఉన్నత బాధ్యతలను అప్పగించింది. లీనా నాయర్‌కి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది.
ఫ్యాషన్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ ఫ్రాన్స్. అక్కడ షునల్ సంస్థను 1910లో స్థాపించారు. మహిళలకు సంబంధించి రెడీ టూ వేర్, యాక్సెసరీస్ అమ్మే వ్యాపారంలోకి వచ్చిన షునల్ అనతి కాలంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో కీలకంగా మారింది. 2019 లెక్కల ప్రకారం ఈ కంపెనీ రెవెన్యూ 11 బిలియన్ డాలర్లు ఉండగా నెట్ ఇన్‌కం 2.14 బిలియన్ డాలర్లుగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment