Leena Nair
-
Leena Nair: ఫ్యాక్టరీ ఫ్లోర్లో పనిచేసిన తొలి మహిళ!
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీని కలుసుకున్న ప్రముఖులలో లీనా నాయర్ ఒకరు. మోదీ ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి గ్లోబల్ బ్రాండ్ చానల్(ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ)కి సీయివో కావడం వరకు ఆమెది స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.... లీనా నాయర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టింది. అక్కడి హోలీ క్రాస్ హైస్కల్, ది న్య కాలేజ్‌లో చదువుకుంది. మహారాష్ట్ర, సంగ్లీ పట్టణంలోని ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. హిందూస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) లో .మేనేజ్మెంట్ ట్రైనీగా ద్యోగ ప్రఉస్థానం మొదలు పెట్టిన లీన ఫ్యాక్టరీ ఫ్లోర్లో పని చేసిన తొలి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన తొలి మహిళ, మేనేజ్మెంట్ కమిటీలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న లీన ‘మేనేజ్మెంట్’ వైపు రావడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లోనే...‘‘చిన్న పట్టణంలో పుట్టి పెరిగాను. ఆ రోజుల్లో అమ్మాయిల కోసం సరిౖయెన బడులు ఉండేవి కావు. అమ్మాయిలు ఇవి మాత్రమే చేయాలి....ఇలా రకరకాల ఆంక్షలు ఉండేవి. పెద్దగా నవ్వడం కూడా పెద్ద తప్పయ్యేది! చిన్నప్పటి నుం నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం. అలా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్‌లో ఉండే ఇంటలెక్చువల్ చాలెంజ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఇంజనీర్‌గా ఉద్యోగజీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాను. అదృష్టవశాత్తు ఒక ప్రొఫెసర్ దగ్గర మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకున్నాను. నీలో అరుదైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అంటూ ఆయనే నన్ను మేనేజ్మెంట్ దిశగా ప్రొత్సహించారు. మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటున్నాను అని నాన్నతో చెబితే ఆయన చాలా నిరాశకు గురయ్యారు. నీలాంటి ప్రతిభ గల ఇంజనీర్ అటు వైపు వెళ్లడం ఏమిటి? అన్నారు. ఆయన అలా అనడంతో నాకు చాలా నిరాశగా అనిపింంది. తరువాత బాగా ఆలోంచాను. అప్పుడు నాకు నేనే గురువుగా మారిపోయా. ‘నీ మనసు చెప్పింది చెయ్. ఎవరో ఏదో అనుకుంటారని సంశయించవద్దు. నీ కంట ఒక లక్ష్యంతో బయలుదేరు’... అలాగే చేశాను. నా కలను నిజం చేసుకున్నాను’’. ప్రతి అనుభవం, ప్రతి పని ఒక పాఠం నేర్పుతుంది. ఫ్యాక్టరీ ఫ్లోర్లో పనిచేసిన అనుభవం నుంచి లీన నేర్చుకున్న పాఠం ఏమిటి? తాను ఫ్యాక్టరీ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. ఒక మహిళ తమ ఫ్యాక్టరీలో పనిచేస్తుందని వారు ఊహించలేదు. తన కోసం ఒక టాయిలెట్ నిర్మించేలా చేయడంలో విజయం సాధించింది లీనా. ‘హెచ్‌యూఎల్’లో పనిచేస్తున్న కాలంలో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్‌కు సంబంధిం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అవన్నీ తన కెరీర్‌కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. ఫ్యాక్టరీలో యంత్రాలలో యంత్రమై పనిచేయలేదు లీన. చీఫ్ హ్యమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా ఉద్యోగులను కనిపెట్టుకొని ఉండేది. ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతున్నా, పనిఒత్తిడితో సతమతం అవుతున్నా....వారిని ఆ స్థితి నుంచి బయటికి తీసుకువచ్చేది. పాకిస్థాన్‌లో ‘హెచ్‌యూఎల్’ షాప్ ఫ్లోర్ కోసం కొందరు అమ్మాయిలు ఉద్యోగంలో చేరారు. అయితే వారి తల్లిదండ్రులకు రకరకాల సందేహాలు ఉండేవి. ఇది గమనింన లీన వారిని కంపెనీ గెస్ట్‌హౌజ్‌లో రెండు వారాల పాటు ఉండేలా చేసింది. తమ పిల్లలు షాప్ ఫ్లోర్లో చేస్తున్న పని ఏమిటి? అక్కడ ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి...మొదలైనవి ప్రత్యక్షంగా చసుకునే అవకాశం వారికి లభించింది. ‘మాకిప్పుడు ఎలాంటి సందేహాలు లేవు. మా పిల్లలు మంచి ఉద్యోగాన్ని ఎంచుకున్నారు’ అన్నారు వారు వెళ్లేటప్పుడు. ‘ప్రతి సమస్యకు ఒకేఒక పరిష్కారం ఉండదు. సందర్భాలు, దేశాలను బట్టి కొత్త పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు అన్వేషించాల్సి ఉంటుంది’ అంటోంది గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానల్’ సీయివో లీనా నాయర్. (చదవండి: పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు) -
లీనా నాయర్: సమానంగా చూడండి చాలు
ఆమె మహిళ అనో .. సపోర్ట్ లేదనో.. పని మెల్లిగా నేర్చుకుంటుందో... మైనారిటీ వర్గమనో.. సానుభూతి చూపారంటే.. దానినే సవాల్‌గా తీసుకొని మరింత శక్తిమంతంగా ఎదగాలని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది లీనా నాయర్. లీనా నాయర్ బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శక్తి. 30 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణలో ఎన్నో క్రియాశీలక పదవులను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునిలీవర్ కంపెనీని జెండర్ బ్యాలెన్స్డ్ కంపెనీగా నిలబెట్టింది. వరల్డ్ వైడ్ లగ్జరీ బ్రాండ్ చానెల్ సీఈవోగా ఉన్న లీనా పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఇప్పుడు వందకుపైగా దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగుల బాధ్యతను సమర్థవంతంగా నడిపిస్తూ మహిళాశక్తిని ఈ తరానికి చాటుతోంది. ► జెండర్ బ్యాలెన్స్.. ఫ్రెంచ్ లగ్జరీ హౌజ్ కోకో చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ ఏడాది జనవరి నుంచి దిగ్విజయంగా విధులను నిర్వర్తిస్తోంది లీనా నాయర్. అంతకుముందు యూనిలీవర్‌కు నాయకత్వం వహించారు. వందకు పైగా దేశాలలో సుమారు లక్షా యాభై వేల మంది బాధ్యత ఆమె మీద ఉంది. 1990 మొదట్లో నాయర్ జంషెడ్‌పూర్‌లోని హిందూస్థాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరినప్పుడు, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆమె కిందటేడాది బయటకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త కంపెనీ నిర్వహణలో లింగ సమతుల్యత ఉందని ప్రకటించింది. అంటే, నాయర్ తనదైన ముద్ర ఏ స్థాయిలో ఆ కంపెనీలో వేసిందనేది స్పష్టం అవుతుంది. ► లగ్జరీ మార్కెట్.. ఫ్యాషన్ దిగ్గజంగా కోకో చానెల్ కంపెనీకి 112 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లగ్జరీ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటోకి దూసుకెళ్లేలా చేసిన మొదటి వ్యక్తి నాయర్ ఏమీ కాదు. అంతకుముందు అనుభవజ్ఞుడైన ఆంటోనియా బెల్లోని ఉన్నాడు. ఇప్పుడు అతను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మరికొంత నిష్ణాతులైన వ్యక్తులు ఈ నిచ్చెన మీద ఇప్పటికే ఉన్నారు. అంటే, వారందరి మధ్య నాయర్‌కి ఆ పదవిని కట్టపెట్టారంటే ఆమె శక్తి సామాన్యమైనది కాదనేది స్పష్టం అవుతుంది. అంతేకాదు, ఆ పదవి ఆమెకు మరింత సవాల్‌తో కూడుకున్నదన్నమాటే. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత వహించిన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సర్వసిద్ధంగా ఉందన్నమాట. ఆమెకు ఇదేమీ కొత్తగాకాదు. ప్రపంచవ్యాప్త యునిలీవర్‌లో 30 సంవత్సరాలు పనిచేసిన మొదటి ఆసియా, మొదటి మహిళ, అతి పిన్న వయస్కురాలు.. అనే రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఆంగ్లో–డచ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలో ఫ్యాక్టరీ ఫ్లోర్ లెవెల్ మేనేజర్‌గా అంతస్తులో పనిచేసిన మొదటి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన మొదటి మహిళగానూ నాయర్‌కు పేరుంది. ► ప్రతిరోజూ సవాల్.. ‘లీనా తను ఏ పని చేసినా దానికో గొప్ప విలువ ఇస్తుంది. ఏ పాత్ర పోషించినా అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చూపడంలో దిట్ట. అందుకే ఆమెకు అంతటా అత్యంత గౌరవం. ఆమె తన కొత్త పాత్రలో రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని కోకో చానెల్‌కు ఎంపికైన సందర్భంలో యునిలీవర్ మాజీ చైర్మన్ దాడి సేత్ ఆమె గురించి గొప్పగా చెప్పారు. కిందటేడాది డిసెంబర్లో నాయర్‌ను సీఇవోగా నియమించాలని చానెల్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఇది పరిశ్రమకే వైవిధ్యమైన మైలురాయిగా అంతా ప్రశంసించారు. ‘నా కెరీర్ ప్రారంభ రోజుల్లో కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ ఒక మహిళగా నా స్థానం ఉండేది. ఉన్నతస్థాయిని సాధించడానికి ప్రతిరోజూ సవాల్‌గా ఉండేది. నామీద ఎవరికైనా సానుభూతి ఉంది అంటే నాకు నేనే అట్టడుగున ఉన్నట్టు అనిపించేది. దానిని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకునేదాన్ని. అందుకే, నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవడానికి ఇప్పటికీ ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను’ అని సవినయంగా చెబుతారు నాయర్. బహుశా అందుకే ఆమె ఎదుగుదల ఈ రీతిలో సాధ్యమైందేమో! ► చిన్న పట్టణం నుంచి ... మహారాష్ట్రలోని చిన్న పట్టణమైన కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేసింది. కాలేజీ పూర్తయిన రోజుల్లో ఒక రోజు కాలేజీ ప్రొఫెసర్ ఆమెను కూర్చోబెట్టి ‘నీవు ఇప్పటికి ఒక అందమైన ఇంజినీర్వే. కానీ, విధి నిర్వహణలో సత్తా చూపగల నైపుణ్యం కలిగి ఉన్నావని భావిస్తున్నాను’ అని చెప్పారట. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరిస్తుంది నాయర్. ఆ తర్వాత పట్టుదలతో ఎంబీయేలో గోల్డ్‌మెడల్ సాధించింది. హిందూస్థాన్ యూనిలీవర్ ఎంపిక చేసుకున్న 15 వేల మంది మగవారిలో అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరిగా నాయర్ ట్రైనీగా చేరింది. -
ఓ మంచి వైరస్‌ను పట్టేశారు: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Congratulate Leena Nair: ఓవైపు కరోనా వేరియెంట్ల విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు వరుసబెట్టి టాప్ కంపెనీల సీఈవోలు బాధ్యతల నుంచి వైదొలుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో వర్చువల్ స్పేస్‌కు భవిష్యత్తు ఉండడం, ట్యాక్స్ చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే వాళ్లంతా వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా భారతీయురాలు లీనా నాయర్ బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే విషయంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ‘మొత్తానికి సిలికాన్ వ్యాలీలో మాత్రమే కాదు.. ప్యారిస్ గల్లీలో కూడా భారతీయ సీఈవో అనే మంచి వైరస్‌ను పట్టేశారు. శెభాష్ లీనా.. మమ్మల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయండి’ అంటూ లీనా నాయర్‌ను అభినందిస్తూనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. So it’s not just Silicon Valley but also Fashion Alley that’s catching the ‘good virus’ of Indian CEOs. Bravo Leena! Keep making us proud. https://t.co/CN54EtMdVs — anand mahindra (@anandmahindra) December 17, 2021 లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్(52) ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి భారతీయురాలు మాత్రమే కాదు.. ఆసియన్ మహిళ కూడా లీనా నాయర్ కావడం భారత్‌కు గర్వకారణం. ఇక ఇంతకు ముందు పరాగ్ ట్విటర్ సీఈవోగా ఎంపికైన సమయంలో ఐరీష్ బిలియనీర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ చేసిన సెటైరిక్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్ సీఈవో వైరస్. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు’ అంటూ దీటుగా ఆనంద్ మహీంద్రా బదులిచ్చిన విషయం తెలిసిందే. లీనా నాయర్ నేపథ్యం.. ఆసక్తికర విషయాలు -
Leena Nair: ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ‘షునల్’ గ్లోబల్ సీఈవోగా భారత సంతతి మహిళ
ప్రపంచ మార్కెట్లో భారత ప్రతిభ ప్రభ వెలిగిపోతుంది. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితుడైన మరికొన్ని రోజుల్లో మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా పని చేసే అవకాశం ప్రవాస భారతీయులకు దక్కింది. లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి ఆసియన్ మహిళ ఆమే కావడం గమనార్హం. 1992లో యూనిలీవర్లో ఫ్యాక్టరీ ఫ్లోర్ ట్రైనీగా జాయిన్ అయిన లీనా నాయర్ అంచెలంచెలుగా ఎదుగుతూ సీహెచ్ఆర్ఓ స్థాయికి చేరుకున్నారు. ఇండియాలోని జంషెడ్‌పూర్‌లో లీనా నాయర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనిలీవర్లో చేరి నిర్విరామంగా 30 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేస్తూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సీహెచ్‌ఆర్‌వోగా సుమారు 1.50ల మంది ఉద్యోగుల బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఫ్యాషన్ కంపెనీ షునల్ మరింత ఉన్నత బాధ్యతలను అప్పగించింది. లీనా నాయర్‌కి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఫ్యాషన్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ ఫ్రాన్స్. అక్కడ షునల్ సంస్థను 1910లో స్థాపించారు. మహిళలకు సంబంధించి రెడీ టూ వేర్, యాక్సెసరీస్ అమ్మే వ్యాపారంలోకి వచ్చిన షునల్ అనతి కాలంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో కీలకంగా మారింది. 2019 లెక్కల ప్రకారం ఈ కంపెనీ రెవెన్యూ 11 బిలియన్ డాలర్లు ఉండగా నెట్ ఇన్‌కం 2.14 బిలియన్ డాలర్లుగా తేలింది. చదవండి: భారతీయ అమెరికన్‌కి వైట్ హౌజ్‌లో కీలక పదవి !