ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీని కలుసుకున్న ప్రముఖులలో లీనా నాయర్ ఒకరు. మోదీ ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ నుంచి గ్లోబల్ బ్రాండ్ చానల్(ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ)కి సీయివో కావడం వరకు ఆమెది స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.... లీనా నాయర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టింది. అక్కడి హోలీ క్రాస్ హైస్కల్, ది న్య కాలేజ్‌లో చదువుకుంది. మహారాష్ట్ర, సంగ్లీ పట్టణంలోని ‘వాల్‌చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. హిందూస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) లో .మేనేజ్‌మెంట్ ట్రైనీగా ద్యోగ ప్రఉస్థానం మొదలు పెట్టిన లీన ఫ్యాక్టరీ ఫ్లోర్‌లో పని చేసిన తొలి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన తొలి మహిళ, మేనేజ్‌మెంట్ కమిటీలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న లీన ‘మేనేజ్‌మెంట్’ వైపు రావడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లోనే...‘‘చిన్న పట్టణంలో పుట్టి పెరిగాను. ఆ రోజుల్లో అమ్మాయిల కోసం సరిౖయెన బడులు ఉండేవి కావు. అమ్మాయిలు ఇవి మాత్రమే చేయాలి....ఇలా రకరకాల ఆంక్షలు ఉండేవి. పెద్దగా నవ్వడం కూడా పెద్ద తప్పయ్యేది! చిన్నప్పటి నుం నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం. అలా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్‌లో ఉండే ఇంటలెక్చువల్ చాలెంజ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఇంజనీర్‌గా ఉద్యోగజీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాను. అదృష్టవశాత్తు ఒక ప్రొఫెసర్ దగ్గర మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకున్నాను. నీలో అరుదైన మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయి అంటూ ఆయనే నన్ను మేనేజ్‌మెంట్ దిశగా ప్రొత్సహించారు.
మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలనుకుంటున్నాను అని నాన్నతో చెబితే ఆయన చాలా నిరాశకు గురయ్యారు. నీలాంటి ప్రతిభ గల ఇంజనీర్ అటు వైపు వెళ్లడం ఏమిటి? అన్నారు. ఆయన అలా అనడంతో నాకు చాలా నిరాశగా అనిపింంది. తరువాత బాగా ఆలోంచాను. అప్పుడు నాకు నేనే గురువుగా మారిపోయా. ‘నీ మనసు చెప్పింది చెయ్. ఎవరో ఏదో అనుకుంటారని సంశయించవద్దు. నీ కంట ఒక లక్ష్యంతో బయలుదేరు’... అలాగే చేశాను. నా కలను నిజం చేసుకున్నాను’’. ప్రతి అనుభవం, ప్రతి పని ఒక పాఠం నేర్పుతుంది. ఫ్యాక్టరీ ఫ్లోర్‌లో పనిచేసిన అనుభవం నుంచి లీన నేర్చుకున్న పాఠం ఏమిటి? తాను ఫ్యాక్టరీ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. ఒక మహిళ తమ ఫ్యాక్టరీలో పనిచేస్తుందని వారు ఊహించలేదు. తన కోసం ఒక టాయిలెట్ నిర్మించేలా చేయడంలో విజయం సాధించింది లీనా.
‘హెచ్‌యూఎల్’లో పనిచేస్తున్న కాలంలో ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్‌కు సంబంధిం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అవన్నీ తన కెరీర్‌కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. ఫ్యాక్టరీలో యంత్రాలలో యంత్రమై పనిచేయలేదు లీన. చీఫ్ హ్యమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా ఉద్యోగులను కనిపెట్టుకొని ఉండేది. ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతున్నా, పనిఒత్తిడితో సతమతం అవుతున్నా....వారిని ఆ స్థితి నుంచి బయటికి తీసుకువచ్చేది. పాకిస్థాన్‌లో ‘హెచ్‌యూఎల్’ షాప్ ఫ్లోర్ కోసం కొందరు అమ్మాయిలు ఉద్యోగంలో చేరారు. అయితే వారి తల్లిదండ్రులకు రకరకాల సందేహాలు ఉండేవి.
ఇది గమనింన లీన వారిని కంపెనీ గెస్ట్‌హౌజ్‌లో రెండు వారాల పాటు ఉండేలా చేసింది. తమ పిల్లలు షాప్ ఫ్లోర్‌లో చేస్తున్న పని ఏమిటి? అక్కడ ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి...మొదలైనవి ప్రత్యక్షంగా చసుకునే అవకాశం వారికి లభించింది. ‘మాకిప్పుడు ఎలాంటి సందేహాలు లేవు. మా పిల్లలు మంచి ఉద్యోగాన్ని ఎంచుకున్నారు’ అన్నారు వారు వెళ్లేటప్పుడు. ‘ప్రతి సమస్యకు ఒకేఒక పరిష్కారం ఉండదు. సందర్భాలు, దేశాలను బట్టి కొత్త పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు అన్వేషించాల్సి ఉంటుంది’ అంటోంది గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానల్’ సీయివో లీనా నాయర్.
(చదవండి: పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు)
Comments
Please login to add a commentAdd a comment