![Paris Fashion Week 2024: Aishwarya Rai Bachchan and Alia Bhatt mesmerizing looks](/styles/webp/s3/article_images/2024/09/24/Parisfashionweek2024_ishwarya-alia.jpg.webp?itok=6Qnkf0rj)
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో అందంగా మెరిసిపోయింది. ఆమె లేని ర్యాంప్‌వాక్ ఊహించలేం అన్నట్టుగా ఎర్రని దుస్తుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. గత కొన్నేళ్లుగా లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐష్ గ్రాండ్ ఫ్యాషన్ గాలాలో ఎప్పటిలాగానే తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Parisfashionweek2024_ishwarya-alia.jpg)
తనదైన స్టయిల్‌లో ఫ్లయింగ్ కిస్, నమస్తేతో ర్యాంప్ వాక్ అదుర్స్ అనిపించింది.
పారిస్‌లోని పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2025 సేకరణలో భాగంగా లోరియల్ పారిస్ షో "వాక్ యువర్ వర్త్" పేరుతో అందాల రాణులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా ర్యాంప్ వ్యాక్ చేశారు. ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో అలియా మెరవడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment