ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ మెరిసింది. ఈ ఫ్యాషన్ షోలో టైటిల్ కోసం పోటీదారులు వినూత్న లగర్జీ ఫ్యాషన్లతో మోడల్స్ గట్టి పోటీస్తున్నారు. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ణి ఫ్రెంచ్ బ్రాండ్ రాబన్నే రూపొందించింది. దాదాపు 18 క్యారెట్ల బంగారంతో రూపొందించడం. అందువల్ల ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా హ్యాండ్ బ్యాండ్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌కి సంబంధించిన 1969 నాటి దివంగత గాయని ఫ్రాంకోయిస్ హార్టీ మినీడ్రెస్ గౌరవార్థం ఆమెకు నివాళిగా ఈ బ్యాగ్‌ని రూపొందించినట్లు బ్రాండ్ వ్యవస్థాపకులు చెబుతున్నారు. లెజెండ్ హార్డీ కోసం ప్రత్యేకంగా ఓ మినీడ్రెస్ని రూపొందించారు. అది వెయ్యి బంగారు ఫలకాలతో దాదాపు 300 క్యారెట్ల వజ్రాలతో డిజైన్‌తో రూపొందించారు. ఆ రోజుల్లో ఇది అత్యంత ఖరీదైన డ్రెస్‌గా వార్తల్లో నిలిచింది. దాని లగ్జరీకి తగ్గ రేంజ్లో ఈ హ్యాండ్ బ్యాగ్‌ని డిజైన్ చేశారు. అంతేగాదు జ్యువెలరీతో కూడిన ఈ లగ్జరీ డ్రెస్‌ని ధరించినప్పుడూ హార్డీని సెక్యూరిటీ గార్డుతో కూడిన సాయుధ వాహనంలో తీసుకు రావాల్సి వచ్చేదట. అయితే తాజాగా రూపొందించిన బంగారపు హ్యాండ్ బ్యాగ్‌ని మైసన్ రాబన్నే, ఆభరణాల వ్యాపారి ఆర్థస్ బెర్ట్రాండ్ల సహకారంతో రూపొందించారు. ఇది ఏకంగా రూ. 2.32 కోట్లు విలువ చేస్తుందట. ఈ హ్యాండ్ బ్యాగ్‌కి చైన్లను అనుసంధానించడానికి కూడా బంగారపు డిస్క్‌లనే అనుసంధానించడనే వాడటం విశేషం. దీన్ని రూపొందించడానికి హ్యాండ్క్రాప్ కళాకారులకు వంద గంటలపైనే సమయం తీసుకుందట. ఈ రాబన్నే బ్రాండ్ 1966లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వంటి సంప్రదాయేతర పదార్థాలను ఉపయోగించి ఫ్యాషన్ ప్రపంచమే ఆశ్చర్యపోయే డిజైన్ వేర్లను తీసుకొచ్చింది. అలా ఇది వినూత్న దుస్తుల ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందిందిగా పేరుగాంచింది. అంతేగాదు కాంటెంపరరీ మెటీరియల్స్(గ్లాస్, సిరామిక్, వుడ్, వజ్రాలు, బంగారం, ప్లాస్టిక్)తో ధరించడానికి వీలుకాని 12 దుస్తులను డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఈ 1969 ప్యారిస్ ఫ్యాషన్ షోలో చాలా విభిన్న ఉపకరణాలతో రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను పరిచయం చేసింది. అవి వరుసగా.. గ్లాస్ బ్యాగ్-దీన్ని ఇటాలియన్ గ్లాస్ మేకర్ వెనిని గ్లాస్ పాస్టిల్స్తో రూపొందించారు, సిరామిక్ బ్యాగ్, పర్షియన్ వర్క్‌షాప్ ఆస్టియర్ డి విల్లట్టే చిన్న క్లే డిస్క్‌లతో తయారు చేశారు. View this post on Instagram A post shared by Arthus Bertrand (@arthusbertrand) (చదవండి: పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!)