
కంపెనీలో పనిచేసే ఉన్నత ఉద్యోగి ఏ పని చేయకుండానే కోట్లు పొందే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు...
పారిస్ : ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీలో పనిచేసే ఉన్నత ఉద్యోగి ఏ పని చేయకుండానే కోట్లు పొందే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. రెండు రోజులు ఆగుంటే దాదాపు 2 మిలియన్ డాలర్లు అతడి సొంతమయ్యేవి. వివరాల్లోకి వెళితే.. పారిస్‌కు చెందిన ఆంటోనీ జినోన్.. సిమెంట్ కంపెనీ లాఫర్జ్ లిమిటెడ్, సింగపూర్ బ్రాంచిలో పనిచేసేవాడు. కానీ, ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. సదరు కంపెనీ మరింత పెద్ద ఉద్యోగం ఇస్తామన్నా పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోనే పనిచేయటానికి అతడు అంగీకరించాడు. సరిగ్గా రెండు రోజుల తర్వాత సదరు కంపెనీ మరో ప్రముఖ కంపెనీ హాల్కిమ్ లిమిటెడ్‌తో కలిసిపోయింది. ( భారత్‌తో ఏకాభిప్రాయం కుదిరింది: చైనా)
ఈ నేపథ్యంలో 2015 ఎంప్లాయిస్ బై అవుట్ ప్రకటించింది. దీంతో తన ఉద్యోగం వదులుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని భావించాడతను. ఫ్రెంచ్ ఎంప్లాయిస్ లా ప్రకారం దాదాపు 2 మిలియన్ డాలర్లు దక్కుతాయనుకున్నాడు. కానీ, రెండు రోజుల ముందు ఆంటోని ఒప్పుకున్న సింగపూర్ ఉద్యోగం కారణంగా అతడు ఫ్రెంచ్ ఎంప్లాయిస్ లా కిందకు రాడని కోర్టు తేల్చింది. దీంతో ఆంటోని కంగుతిన్నాడు.