మేం లవర్స్‌ కాదు.. జస్ట్‌ ఫ్రెండ్స్‌! | Taapsee Pannu goes on a lunch date with boyfriend Mathias Boe | Sakshi
Sakshi News home page

మేం లవర్స్‌ కాదు.. జస్ట్‌ ఫ్రెండ్స్‌!

Published Sat, Aug 11 2018 12:42 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

Taapsee Pannu goes on a lunch date with boyfriend Mathias Boe - Sakshi

∙తాప్సీ, మథియాస్‌ బో, దిశా పాట్నీ, టైగర్‌ ష్రాఫ్‌

ప్లేటులో పెట్టిన బిర్యానీ ప్లేటులోనే ఉంది. ఇప్పుడు తినకపోతే నేను కరిగిపోతా అని ఐస్‌క్రీమ్‌ ఆశగా చూసినా ఊహూ... ఐసు, మనసు వాటి మీద ఉంటేనే కదా. వెళ్లింది లంచ్‌ డేట్‌కే అయినా కారణం వేరు. స్వీట్లు, హాటులు తినడంకన్నా స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకోవాలన్నదే మెయిన్‌ రీజన్‌. కారణం ఏదైనా లంచ్‌ డేట్‌కి వెళ్లిన ప్రేమ పక్షుల మీదే అందరి చూపు. ముంబైలోని రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌లో రెండు జంటలు లంచ్‌ డేట్‌కి వెళ్లి హాట్‌ టాపిక్‌గా మారారు. ఒక జంట మథియాస్‌ బో–తాప్సీ అయితే మరో జంట టైగర్‌ ష్రాఫ్‌–దిశా పాట్నీ. ‘‘మీరంతా అనుకున్నట్లు మేం లవర్స్‌ కాదు.. జస్ట్‌ ఫ్రెండ్స్‌. అయినా లవ్‌లో పడితే మేమే చెబుతాం’’ అని ఈ రెండు జంటలూ కొన్ని సందర్భాల్లో చెప్పారు.

మరి.. ఏమీ లేకపోతే ఈ లంచ్‌ డేటులూ, డిన్నర్‌ డేటులూ ఏంటమ్మా? అంటే.. నో ఆన్సర్‌. ‘‘మేమే చెబుతాం’’ అన్నారు కదా సమాధానం ఎదురు చూడటం కూడా కరెక్ట్‌ కాదేమో. ఇంతకీ మథియాస్‌ బోతో తాప్సీ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి కదా.. ఆ మథియాస్‌ ఎవరంటే డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్‌మింటన్‌ ప్లేయర్‌. ఓసారి మ్యాచ్‌ చూడ్డానికి వెళ్లినప్పుడే ఇద్దరి కళ్లూ కలిశాయని, పరిచయం ప్రేమగా మారిందని టాక్‌. ఇక, టైగర్, దిశా గురించి చెప్పాలంటే, రెండేళ్ల క్రితం ‘బేఫిక్రా’ అనే మ్యూజిక్‌ వీడియోలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారని వార్త. ఆ తర్వాత ఇద్దరూ ‘భాగీ 2’ సినిమాలో జంటగా నటించారు. ప్రేమ రోజు రోజుకీ పెరుగుతోందట. కానీ మేం క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంటున్నారు. ఏదేతైనేం ఔత్సాహికరాయుళ్ల నోటికి ఈ జంటలు మంచి మేత ఇస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement