'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమమైన తాప్సీ పన్ను.. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ సొట్టబుగ్గల సుందరి అక్కడ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బీటౌన్‌లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా కొన్నాళ్లుగా ఈ ఢిల్లీ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇటీవల తాప్సీ వెళ్లిన మాల్దీవుల వెకేషన్‌కు కూడా మథియాస్ వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా తాప్సీ షేర్ చేసింది. తాజాగా ఈ భామ తన బాయ్‌ఫ్రెండ్ గురించి మొదటిసారి నోరు విప్పింది.
తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడరెందుకని తాప్సీని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దానిపై ఆమె స్పందించింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం తనకిష్టం లేదని తెలిపింది. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేర్వేరుగా ఉంచాలనుకుంటాను. నాకు సంబంధించిన వారి పుట్టినరోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్‌ను పంచుకుంటాను. నా పర్సనల్ లైఫ్‌లో భాగమైన మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది.
పెళ్లి గురించి తాప్సీ మాట్లాడుతూ..‘నేను ఏదో ఒకసారి అయిదారు సినిమాలు చేయడానికి బదులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడతాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరుకుతుంది’ అని పేర్కొంది. ఇక పోతే ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, సినిమాలు తగ్గించాలనుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పకనే చెప్పింది తాప్సీ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రష్మీ రాకెట్, తమిళంలో జనగణమన చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది.
చదవండి: ఆమె డీఎన్‌ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ
చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment