సీక్రెట్‌గా ప్రియుడిని పెళ్లాడిన తాప్సీ! | Actor Taapsee Pannu and Boyfriend Mathias Boe are Now Married: Report | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం!

Published Mon, Mar 25 2024 12:41 PM | Last Updated on Mon, Mar 25 2024 1:37 PM

Actor Taapsee Pannu and Boyfriend Mathias Boe are Now Married: Report - Sakshi

హీరోయిన్‌ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్‌ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్‌ అయింది. కట్‌ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోను వివాహమాడింది.

ఉదయ్‌పూర్‌లో రహస్య వివాహం
బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఉదయ్‌పూర్‌లో రహస్యంగా పెళ్లి చేసుకుందీ భామ. తన పెళ్లి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉండకూడదనే ఎవవరికీ పెద్దగా ఆహ్వానాలు పంపించలేదట. తనతో పని చేసిన పవైల్‌ గులాటి, కనిక ధిల్లాన్‌, అనురాగ్‌ కశ్యప్‌ వంటి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.

ఆ పెళ్లిలోనే వీళ్లంతా..
ఇటీవలే కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్‌ జత చేసింది. అటు పవైల్‌ కూడా తాప్సీ సోదరి షగ్ను పన్నుతో పాటు మరికొందరితో గ్రూప్‌గా దిగిన ఫోటో షేర్‌ చేశాడు. ఇవన్నీ చూసిన జనాలు.. తాప్సీకి పెళ్లయిపోయిందంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక తాప్సీ కెరీర్‌ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయిపోయింది. అక్కడ ఓ పక్క స్టార్‌ హీరోలతో నటిస్తూనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేస్తోంది. 

చదవండి: సినిమా ఆఫర్ల కోసం నేను చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదే: ఆశిష్‌ విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement