లవ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది? | Ileana D'Cruz professes her love online | Sakshi
Sakshi News home page

లవ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది?

Published Tue, Jul 22 2014 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

లవ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది? - Sakshi

లవ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది?

 దేవదాస్ పేరుతో తెరకెక్కిన చిత్రం ద్వారా హీరోయిన్‌గా దక్షిణాదికి పరిచయం అయిన నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీకి ఆ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగులో దేవదాస్ తరువాత పోకిరి ఆమె స్థాయిని మరింత పెంచింది. తమిళంలో నన్భన్ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న ఇలియానా ప్రస్తుతం తన దృష్టినంతా పూర్తి బాలీవుడ్‌పైనే సారిస్తుండటం విశేషం. తన ప్రియుడు కూడా ముంబయిలో సెటిల్ అవడం కూడా అందుకు కారణం కావచ్చు. ఏమిటి సడన్‌గా ఇలియానా ప్రియుడి ప్రస్తావన తీసుకొస్తున్నారని అనుకుంటున్నారా? ఆమె ప్రేమ వ్యవహారం ప్రియుడి సమాచారం గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది.
 
 వారి సహ జీవనం గురించి చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇంతవరకు చాలా గుంభనంగా ఉంటూ వ్యక్తిగతం గురించి మాట్లాడడం ఇష్టం లేదంటూ దాటవేసే ధోరణిని అవలంభించిన ఇలియానా ప్రేమ వ్యవహారం తాజాగా బట్టబయలైంది. ప్రస్తుతం ఇలియానా తన ప్రియుడు ఆండ్య్రూతో బాహాటంగానే డేటింగ్ చేస్తుండడం విశేషం. తాను మాత్రం నిజాన్ని ఎంతకాలం దాచగలననుకున్నారో, లేక త్వరలో తాళికి తల వంచబోతున్నారో సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో గడిపేస్తున్నారట. అలాగే ఇటీవల పుట్టిన రోజును జరుపుకున్న ఆండ్యూ శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్‌లో ఏమని పోస్ట్ చేశారో చూద్దాం. ‘‘హ్యాపీ బర్త్‌డే ఎట్ ఆండ్య్రు. బహుశా ఈ సమయంలో నేను నీ చెంత ఉంటే ఈ ఏడాది నీకు అత్యంత సంతోషకరమైన పుట్టిన రోజు అయి ఉండేదేమో’’ అని పేర్కొన్నారు.
 
 అందుకు ఆండ్య్రూ బదులిస్తూ ‘‘అమ్మాయిలు ఎలాంటి మగవారిని ప్రేమిస్తారో తెలుసా? డీసెంట్‌గా ఉండేవారిని, ఆ తరువాత బాగా వంట చేసి పెట్టేవారిని, మంచి కండల వీరుడిని’’ అని పోస్టు చేశారు. అందుకు ఇలియానా ‘‘అహ్హా..హా..హ్హా... అలాంటి నిన్ను నేను లవ్ చేయడంలో ఆశ్చర్యమేముంది’’ అంటూ బదులిచ్చారు. అందుకు ఆండ్య్రూ స్పందిస్తూ ‘‘ఎప్పుడైతే నువ్వలా అన్నావో నాకు లైఫ్ లాటరీలో గెలిచినంత ఆనందంగా ఉంది ఐ లవ్యూ’’ అంటూ బదులిచ్చారు. ఇలియానా, ఆండ్య్రూల ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ఈ ప్రేమికులిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం హ్యాపీ ఎండింగ్‌లో నటిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్యూ మంచి ఫోటోగ్రాఫర్, గిటారిస్ట్ కూడానట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement