నేను ప్రేమలో విఫలమయ్యా! | my love failure ileana d'cruz | Sakshi
Sakshi News home page

నేను ప్రేమలో విఫలమయ్యా!

Published Sat, Aug 13 2016 2:34 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

నేను ప్రేమలో విఫలమయ్యా! - Sakshi

నేను ప్రేమలో విఫలమయ్యా!

నేను ఇంతకు ముందొక సారి ప్రేమలో పడ్డాను. అయితే ఆ ప్రేమ విఫలమైందని పేర్కొన్నారు నటి ఇలియానా. ఆదిలో కోలీవుడ్‌నే వెతుక్కుంటూ వచ్చిన ఆ గోవా సుందరికి ఇక్కడ ఎవరూ గుర్తించలేదు.అయితే టాలీవుడ్  మాత్రం తొలి చిత్రంతోనే అక్కున చేర్చుకుంది. అంతే కాదు టాప్ హీరోయిన్ అందలం ఎక్కించింది. ఆ తరువాత కోలీవుడ్‌లో విజయ్‌తో న న్భన్ చిత్రంలో నటించే అవకాశాన్ని మాత్రం వాడుకుని మళ్లీ ఇటువైపు చూడలేదు.అంతే కాదు ఆ తరువాత ఉన్నత స్థాయికి చేర్చిన టాలీవుడ్‌ను కాదనీ బాలీవుడ్ మోహంతో హిందీ చిత్రాలపై దృష్టి సారించారు. అయితే అక్కడ అమ్మడిని అంతగా పట్టించుకోలేదు.
 
 బర్ఫీ లాంటి కొన్ని చిత్రాలు చేసినా ఆపై దాదాపు రెండేళ్లు ఇలియానాను బాలీవుడ్ దూరంగా పెట్టేసింది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో నటించిన రుస్తుం చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు కొత్త చిత్రాలేమీ లేవు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమ కలాపాలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని ఎంత హాయి ఈ రేయి అని డ్యూయెట్లు కూడా పాడుకుంటున్నారట. త్వరలో ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఇలియానా ఒక భేటీలో పేర్కొంటూ యువతీయువకులు ప్రేమలో పడ్డప్పుడు కలల్లో తేలిపోతుంటారన్నారు.
 
  నీవు లేక నేను లేను, నీవే నాలోకం అంటూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారన్నారు. అలాంటిది ప్రేమ విఫలం అయితే ఒకరినొకరు విమర్శించుకుంటార ని, ఆరోపణలు గుప్పించుకుంటూ కొట్టుకునే వరకూ వెళతారన్నారు. అంతటితో ఆగకుండా పగతీర్చుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అయితే అది కరెక్ట్ కాదన్నారు. తాను ఇంతకు ముందు ఒకరిని ప్రేమించానని, ఒక దశలో అభిప్రాయ భేదాల కారణంగా ఆ ప్రేమ విఫలమైందని తెలిపారు.
 
 దీంతో నీ దారి నీది నా దారి అనుకుని విడిపోయాం గానీ, ఒకరినొకరు విమర్శించుకోలేదన్నారు. గొడవలు పడలేదని, ఒకరిపై ఒకరు పగ పెంచుకోలేదని చెప్పారు. అలాగని ఆ తరువాత స్నేహంగా మెలగలేదని అన్నారు. ఇక తన పెళ్లి గురించి అడుగుతున్నారని,సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అన్నారు.అయితే ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని ఇలియానా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement