మేం ప్రేమలో పడితే మీకేంటి?
మేం ప్రేమలో పడితే మీకేంటి?
Published Sun, Mar 2 2014 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
దక్షిణాదిన ఓ వెలుగు వెలిగి ఉత్తరాదిన తన సత్తా చాటుకునే పనిలో ఉన్నారు ఇలియానా. హిందీలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న ఇలియానా మరోవైపు తన బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారట. ఈ వ్యవహారం గురించి బాలీవుడ్‌లో చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. మీరు ప్రేమలో పడ్డారట? అని ఇటీవల ఎవరో ఇలియానాని అడిగితే -‘‘అసలు నా విషయం మీకెందుకండి? మేం సినిమాల్లో ఏం చేసినా చూస్తారు. చివరికి ఐటమ్ సాంగ్స్ చేసినా ఆనందంగా చూసేస్తారు. హీరోయిన్ కదా.. ఐటమ్ సాంగ్ చేసిందేంటి? అని అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా మాట్లాడరు.
కానీ, ఏ హీరోతోనో, స్నేహితుడితోనో మాట్లాడుతూ కనిపిస్తే చాలు.. ‘ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్’ అనేస్తారు. అయినా మేం ప్రేమలో పడితే మీకేంటి? పడకపోతే ఏంటి? అది మా వ్యక్తిగత విషయం. ఒకవేళ ప్రేమించినా అది తప్పా? చెయ్యకూడని తప్పేదో చేసినట్లుగా ప్రచారం చేస్తారు. మేమూ మనుషులమే. మీరు ప్రేమలో పడ్డట్లే మేమూ పడతాం. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకెందుకు? మేం సెల బ్రిటీలం కనుక వదంతులు ఎదుర్కోవడం అలవాటైపోతుంది. మరి.. మా కుటుంబ సభ్యుల సంగతేంటి? వాళ్లు ఫీలవరా’’ అని ఘాటుగా స్పందించారట.
Advertisement
Advertisement