బాలీవుడ్‌లో గోల్డెన్‌ఛాన్స్! | Ileana Set To Romance Shahrukh Khan In YRF Next | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో గోల్డెన్‌ఛాన్స్!

Published Fri, Sep 19 2014 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్‌లో గోల్డెన్‌ఛాన్స్! - Sakshi

బాలీవుడ్‌లో గోల్డెన్‌ఛాన్స్!

దక్షిణాది కథానాయికలకు బాలీవుడ్‌లో సినిమా చేయడం కష్టమేం కాదు. అయితే... అక్కడ నిలదొక్కుకోవడమే కష్టం. గతంలో శ్రీదేవి దక్షిణాది నుంచి వెళ్లి సూపర్‌స్టార్‌గా బాలీవుడ్ తెరను ఏలారు. ఆమధ్య అసిన్ కూడా రెండుమూడేళ్ల పాటు హవా సాగించారు. ఈ మధ్య కాజల్ అగర్వాల్, తమన్నాలు బాలీవుడ్‌లో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నా, గొప్పగా పేరుప్రఖ్యాతులు రాలేదు. అయితే... ఇలియానా వీరిద్దరికంటే కొంచెం బెటర్ అని చెప్పాలి. తొలి సినిమా ‘బర్ఫీ’తోనే అక్కడ విమర్శకుల ప్రశంసలందుకున్నారామె. ఆ తర్వాత వచ్చిన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇలియానాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇటీవల తన బికినీ ఫొటోషూట్‌తో బాలీవుడ్ దిగ్గజాల దృష్టిని అమితంగా ఆకర్షించేశారు ఈ గోవా బ్యూటీ.
 
 అందుకే... అద్భుతమైన అవకాశం ఈ అందాలభామకు తలుపు తట్టిందని వినికిడి. ప్రస్తుతం ముంబయ్‌లో ఇదే హాట్ టాపిక్. విషయం ఏంటంటే.. త్వరలో ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించనున్న చిత్రాల్లో ఇలియానా కథానాయికగా నటించనున్నారట. కొత్తగా ఏ హీరోయిన్‌ని తీసుకున్నా... ఆమెతో ఒకేసారి మూడు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకోవడం యశ్‌రాజ్ ఫిలింస్ వారికి అనవాయితీ. ఆ విధంగా ఇలియానాతో కూడా మూడు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ఒకటి సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ సినిమా. మరొకటి రణ్‌బీర్ కపూర్ చిత్రం. ఇంకొకటి సల్మాన్‌ఖాన్ మూవీ. ఈ మూడు సినిమాలతో ఇలియానా ఫేట్ మారిపోవడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement