ఇలియానా ఫోటోలను కొత్తగా ఓ లుక్కేద్దాం | Ileana DCruz Birthday: Interesting Facts | Sakshi
Sakshi News home page

ఇలియానా పాత ఫోటోలను కొత్తగా ఓ లుక్కేద్దాం

Published Mon, Nov 2 2020 6:55 PM | Last Updated on Mon, Nov 2 2020 8:58 PM

Ileana DCruz Birthday: Interesting Facts - Sakshi

ఇలియానా బాలీవుడ్‌ ప్రయాణం బర్ఫీ సినిమాలో ఒక ఛాలెంజింగ్‌ రోల్‌తో మొదలైంది. ఆ సినిమాలో ఎంతో ప్రతిభ ఉన్న రణభీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా పక్కన్న తనదైన నటనతో ఆకట్టుకుంది. అప్పటి నుంచి తన నటనతో, హావభావాలతో ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ ప్రేక్షకులని కట్టిపడేస్తున్న ఈ గోవా బ్యూటీ ఈ సంవత్సరం తన 34వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 2019లో పాగల్‌పంటి సినిమాతో ప్రేక్షకుల ముందు​కు వచ్చిన ఇలియానా ఈ సంవత్సరం కొన్ని కొత్త సినిమాలతో మనల్ని అలరించనున్నారు.   (నివేదాకు వకీల్‌ సాబ్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌)

ఈ న్యూ నార్మల్‌ కాలంలో తన తరువాతి సినిమా 'అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' టీమ్‌ స్క్రిప్ట్ రీడింగ్‌ సెషన్‌ కూడా మొదలు పెట్టేసారని ఆమె తెలిపారు. సోనీ పిక్చర్స్‌ ఇండియా, మూవీ టన్నల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిరిస్తున్న అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ సినిమా నల్లగా ఉండడం వల్ల సమాజంలో ఎంతో పక్షపాతాన్ని ఎదుర్కొంటున్న ఒక అమ్మాయి కథ. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఇలియానాకు జోడీగా రణదీప్‌ హుడా నటించనున్నాడు. ఇలియానా ఇంతకు ముందు నటించిన ముబారకాన్‌ సినిమాకు  స్క్రీన్ ప్లే రాసిన బల్‌వీందర్‌ సింగ్‌ జాంజువా ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. 

ఇలియానా పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌లపై ఓ లుక్కేద్దాం...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఆమె మానసిక ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూ మనల్ని మనం జాగ్రత్తగా ఎలా చూస్కోవాలో చెప్తూనే ఉంటారు. 2020 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె పోస్ట్‌ చేసిన సన్‌సెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో దిగిన సెల్ఫీ ఒక్కసారిగా గుండెదడ పెంచేసింది. దీనికి క్యాప్షన్‌: ఈ రోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా మనం మన రోజూవారీ జీవితంలో మానసిక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇద్దామా? అంటూ పోస్ట్‌ చేసింది.

సైజ్‌ జీరో చేప
ఇలియానాకు బీచ్‌లపై, సముద్రంపై ఉన్న ప్రేమను మరోసారి చూపించుకున్నారు. గతంలో దిగిన ఈ ఫోటోలో తన ఈమె తన స్విమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. 

సర్వసాధారణంగా కనిపిస్తూ
ఇలియానా న్యూ ఇయర్‌ పోస్ట్‌ చూస్తే తను గ్లామర్‌తో మెరవడమే కాదు సాధారణంగా కూడా అందంగానే ఉంటుందని చెప్పాల్సిందే. 

కుందనపు బొమ్మ
పర్పల్‌ రంగు వెడ్డింగ్ గౌనులో విశ్వాసమే ఆభరణంగా ధరించిన ఇలియానా ఇంకా అందంగా కనిపిస్తున్నారు. 

జాగ్రత్తగా ఉండండి
ఎవరూ ఊహించకుండా వచ్చిపడిన లాక్‌డౌన్‌ కాలంలో వర్క్‌అవుట్ తర్వాత సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ అందరిని జాగ్రత్తగా ఉండమని కోరారు ఇలియానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement