శ్రీమతి ఇలియానా?! | Is Ileana D'Cruz is secretly married to Andrew Kneebone? | Sakshi
Sakshi News home page

శ్రీమతి ఇలియానా?!

Published Tue, Aug 23 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

శ్రీమతి ఇలియానా?!

శ్రీమతి ఇలియానా?!

 పెళ్లైన ఆడవాళ్లను ‘శ్రీమతి’ అని, కానివాళ్లను ‘కుమారి’ అని సంబోధించడం, గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. ఆ లెక్కన ఇలియానాకి పెళ్లి కాలేదు కనుక ‘కుమారి ఇలియానా’ అనడం సబబు. మరి, శ్రీమతి అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నారా! ఈ గోవా బ్యూటీకి పెళ్లైందనేది తాజా ఖబర్. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ప్రేమలో ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆండ్రూతో తన ప్రేమాయణం బయటకు రాకుండా దాచేయాలని ఇలియానా ఎప్పుడూ ప్రయత్నించలేదు.
 
 ఈ ప్రేమ పక్షులు బహిరంగంగా  చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అటు ముంబై, ఇటు హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. గతేడాది డిసెంబర్ లోనే ఆస్ట్రేలియాలో ఆండ్రూ, ఇలియానాల పెళ్లి జరిగిందట. పెళ్లికి హాజరైన అతిథులతో ఎక్కడా తమ పెళ్లి విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారట. ప్రేమ, శృంగారం వంటి విషయాల గురించి పలు సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడిన ఇలియానా పెళ్లైన సంగతి ఎందుకు దాచారు? ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా.. పెళ్లి జరగలేదా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement