మా ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది
మా ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది
Published Wed, Sep 11 2013 1:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
దక్షిణాది సినిమాను నిర్లక్ష్యం చేస్తోందనేది మొన్నటివరకూ ఇలియానాపై ఉన్న అభియోగం. కానీ ఈ మధ్య ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్‌వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలియానా చెప్పిన సమాధానం... ఆ అభియోగం తప్పని చెబుతోంది.
సౌత్ సినిమాను పక్కన పెట్టేసినట్టేనా? అని ఓ విలేకరి ఈ గోవా బ్యూటీని అడిగితే -‘‘సౌత్ సినిమా లేకపోతే ఈ రోజు మీరు నా ఇంటర్‌వ్యూ చేసేవారా? అసలు ఇలియానా అనే నటి ప్రపంచానికి తెలిసేదా? అని సదరు జర్నలిస్ట్‌పై ప్రశ్నాస్త్రాలను సంధించారు ఇలియానా ‘‘బాలీవుడ్‌లో నాకు ఎంత స్టార్‌డమ్ వచ్చినా సరే... సౌత్ సినిమాను మాత్రం వదలను. ప్రస్తుతం అక్కడ సినిమాలు చేయకపోవడానికి కారణం ఒక్కటే. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేశాను.
అవి పూర్తవ్వాలి. కొన్ని తెలుగు సినిమాలకు సంబంధించిన కథలు వింటున్నాను కూడా. అన్ని కుదిరితే త్వరలోనే ఓ మంచి తెలుగు సినిమాలో చేస్తా’’ అని చెప్పారు ఇలియానా. ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘షాహిద్‌కపూర్‌ని అందరూ ‘చాక్లెట్‌బోయ్’ అంటుంటే ఏమో అనుకున్నాను. తను నిజంగా చాక్లెట్‌బోయే. ఆ ఇమేజ్, ఆయన లుక్స్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇందులో మా ఇద్దరి కెమెస్ట్రీ అదిరిపోయింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, డ్రామా...
ఇలా అన్ని అంశాలూ ఉన్న సినిమా ఇది. తప్పకుండా నా బాలీవుడ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుంది. రాజ్‌కుమార్ సంతోషీ డెరైక్షన్ సూపర్బ్. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఆ రోజు కోసం ఎంతో ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు ఇలియానా.
Advertisement
Advertisement