గోవా బ్యూటీ ఇలియానా గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇలియానానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..‘లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను’అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇలియానా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమె ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసు. ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవడం సరికాదు అని కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా పెళ్లి అయింది. కొన్నాళ్లు కలిసి జీవించిన ఈ జంట.. 2019లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత భర్తను పరిచయం చేసే అవకాశం ఉందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. సరోగసీ లేదా దత్తత తీసుకోవడం ద్వారా ఇలియానా తల్లి అయ్యే ఛాన్స్ ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇలియానా లైఫ్ పార్టనర్ ఎవరనేది అధికారికంగా ఎవ్వరికీ తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment