అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..! | Ileana's Bollywood movie 'Phata Poster Nikla Hero' | Sakshi
Sakshi News home page

అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..!

Oct 3 2013 11:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..! - Sakshi

అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..!

బాలీవుడ్‌లో ఇలియానాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రమే ఆమె కష్టాలకు కారణం. ‘బర్ఫీ’తో సంపాదించుకున్న క్రే జ్ మొతాన్ని ‘పటా పోస్టర్’ ఫట్ మనిపించడంతో ఇల్లూబేబీ ఒక్కసారిగా డల్ అయిపోయారట.

బాలీవుడ్‌లో ఇలియానాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రమే ఆమె కష్టాలకు కారణం. ‘బర్ఫీ’తో సంపాదించుకున్న క్రే జ్ మొతాన్ని ‘పటా పోస్టర్’ ఫట్ మనిపించడంతో ఇల్లూబేబీ ఒక్కసారిగా డల్ అయిపోయారట. దీనికి తోడు పుండుమీద కారంలా... బాలీవుడ్ మీడియా ఇలియానాపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తూ కథనాలను కూడా ప్రసారం చేస్తోందట.
 
 బక్కపలుచగా, పీక్కుపోయినట్టుగా ఈ సినిమాలో ఇలియానా ఉందని ఘాటైన పదజాలంతో రివ్యూలు రాసేశారట. ఇక దక్షిణాది సినిమానే ఇలియానాకు దిక్కు అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారట. ఈ విషయమై ఇలియానా స్పందిస్తూ -‘‘సినిమా హిట్ అయితే... అందరం అందంగా కనిపిస్తాం. అదే ఫ్లాప్ అయితే... ఇదిగో ఇలాంటి విమర్శలే వస్తాయి.
 
 ఇవి నాకేం కొత్తకాదు. సౌత్‌లో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా. కానీ అక్కడ అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికను నేనే. ‘బర్ఫీ’లో బార్బీ బొమ్మలా ఉందని రాసిన ఈ మీడియావారే... ఈ సినిమా విషయంలో ఇలా రాశారు. అదంతా ఆ సినిమాల మహత్యం. ఆ కామెంట్‌లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం సైఫ్‌అలీఖాన్‌తో నేను చేస్తున్న  ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ తప్పకుండా  నాకు మంచిపేరు తెస్తాయని నమ్మకం నాకుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement