దేవదాసు మూవీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరీ సినిమాతో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం గోవాలోనే. నటిగా టాలీవుడ్‌లో దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచేసింది. ఆ చిత్రం విజయంతో తెలుగు దర్శక నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. దీంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలా అగ్ర కథానాయకిగా ఉన్న రోజుల్లోనే తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. బాలీవుడ్‌పై ఆశతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై మనసు పారేసుకుంది. అంతే ఆమె కెరీర్ అక్కడితో ఖతం అయిపోయిందని చెప్పాలి.
(ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి)
ఇక కేడీ చిత్రం ద్వారా పరిచయమైనా ఆ చిత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విజయ్ సరసన నన్బన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా ఇలియానా మాత్రం మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. అలా ఇలియానా కథ ముగిసిపోయింది. అయితే ఈమె ప్రేమ గురించి పలు వదంతులు ప్రచారమయ్యాయి.
కానీ ఇటీవలే చివరికి పెళ్లి కాకుండానే తల్లి కూడా అయ్యింది. ఆ తర్వాత మైకేల్ డోలన్ తన బిడ్డకు తండ్రి అని బహిరంగంగా ప్రకటించింది. ఇటీవలే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కోయ ఫినిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఈ సందర్భంగా తన మాతృహృదయం గురించి ఇలియానా ట్విట్టర్‌లో పేర్కొంది. అమ్మతనాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్లు చెప్పింది.
(ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!)
రెండు నెలలే పూర్తయిన తన బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో తన గుండె వేదనతో కొట్టుకుందని ఇలియానా చెప్పింది. కన్న బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు కలిగే బాధను ఎలా భరించాలి అన్నది ఎవరు చెప్పరని తెలిపింది. ఏ మహిళ అయినా తల్లి అయిన తర్వాతే ఈ బాధ అర్థం అవుతుందని పేర్కొంది. అయితే తన ప్రేమికుడు తాను కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పారని తన కన్నీటిని తుడిచి నవ్వించారని చెప్పింది. ఆయన తన పక్కన ఉంటే ఏది కష్టం అనిపించలేదని, ఇప్పుడు తాను తన బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని ఇలియానా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment