
తెలుగులో ఎప్పటికప్పుడు చాలామంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు.

అలా కొందరు స్టార్ హీరోయిన్లు అయితే.. చిన్న తప్పులతో ఇండస్ట్రీకి దూరమైనోళ్లు మరికొందరు.

వీళ్లలో ఒకరే ఇలియానా. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు (నవంబర్ 01).

క్రిస్టియన్ తండ్రి, ముస్లిం తల్లికి ఇలియానా పుట్టింది. పదేళ్లు వయసులో ఫ్యామిలీతో గోవాకి షిఫ్ట్ అయింది.

2003లో మోడలింగ్‌లోకి వచ్చిన ఇలియానా.. పలు యాడ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

అలా తెలుగు దర్శకుడు తేజ దృష్టిలో పడింది. కానీ అతడితో ప్రాజెక్ట్ మొదలవకుండానే క్యాన్సిల్ అయింది.

కట్ చేస్తే 'దేవదాసు' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్.

దీని తర్వాత మహేశ్ బాబుతో 'పోకిరి' చేసింది. దీంతో ఇలియానా పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికి.. జల్సా, కిక్, జులాయి తదితర చిత్రాలు ఈమెకు క్రేజ్ తెచ్చిపెట్టాయి.

తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ వైపు చూసింది.

2012-18 మధ్య పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ అస్సలు కలిసి రాలేదు.

దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. 2018లో రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' చేసింది. ఇది డిజాస్టర్ అయింది.

దీని తర్వాత ఒకటి రెండు హిందీ సినిమాలు చేసింది. కానీ అస్సలు కలిసిరాలేదు.

అయితే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీని విడిచిపెట్టడం ఈమె చేసిన పెద్ద తప్పు అనొచ్చు.

2018 టైంలోనే ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది. కానీ అతడితో విడిపోయింది.

2023 మేలో మైఖేల్ డోలన్ ని పెళ్లి చేసుకుంది. ఆగస్టులో వీళ్లకు బాబు పుట్టాడు. అంటే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనమాట.




