
టాలీవుడ్‌లోకి పదుల సంఖ్యలో హీరోయిన్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు.

కానీ వీళ్లలో స్టార్‌డమ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు.

అలా 'తొలిప్రేమ' మూవీతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది కీర్తి రెడ్డి.

హైదరాబాద్‌లో ఈమె పుట్టింది. కానీ పెరగడం, చదువంతా బెంగళూరులోనే.

ఈమె తాత కేశపల్లి గంగా రెడ్డి అప్పట్లో నిజమాబాద్ ఎంపీగా పనిచేశారు.

1996లో 'గన్ షాట్' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా పేరేం రాలేదు.

దీని తర్వాత రెండేళ్ల పాటు తమిళంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులోకి వచ్చింది.

1998లో 'తొలిప్రేమ' సినిమా దెబ్బకు ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

కానీ ఆ తర్వాత కెరీర్‌ని సరిగా ప్లాన్ చేసుకోలేక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది.

చివరగా 'అర్జున్' మూవీలో మహేశ్ బాబుకు అక్కగా నటించింది.

అక్కినేని హీరోల్లో ఒకరైన సుమంత్‌ని ఈమె 2004లో పెళ్లిచేసుకుంది. కానీ 2006లో వీళ్లిద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత ఈమె అమెరికా వెళ్లిపోయింది. అక్కడే డాక్టర్‌ని పెళ్లి చేసుకుని సెటిలైపోయిందని టాక్.

కీర్తి రెడ్డి సోషల్ మీడియాకు చాలా దూరం. అందుకే ఈమె ఇప్పుడేం చేస్తుందనేది ఎవరికీ తెలీదు.
















