
తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు రావనేది అందరికీ తెలిసినమాటే.

మహా అయితే ఒకటో రెండో సినిమాల్లో కనిపిస్తారు. ఆ తర్వాత ఏమైపోతారో తెలీదు.

అలాంటి ఓ బ్యూటీనే ప్రియాంక జవాల్కర్. కాకపోతే అప్పుడో ఇప్పుడో అన్నట్లు సినిమాల్లో కనిపిస్తోంది.

అనంతపురంలో పుట్టిన ప్రియాంక జవాల్కర్‌ది మరాఠీ కుటుంబం.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన ఈమె.. 2017లో 'కళవరమాయే' సినిమాతో హీరోయిన్ అయింది.

దీని తర్వాత విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా', కిరణ్ అబ్బవరం 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాలతో హిట్ కొట్టింది.

'తిమ్మరసు', 'గమనం' సినిమాలతోనూ ఈమె తన వంతు సక్సెస్ అయింది.

చేసిన సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి కావాల్సినంత గ్లామర్ కూడా ఉంది.

కానీ తెలుగు దర్శకులు ఈమెకు సరైన ఛాన్స్‌లు ఇవ్వట్లేదా అనిపిస్తుంది.

'టిల్లు స్క్వేర్' లాంటి మూవీలో చిన్న పాత్రలో కనిపించింది. బాలయ్య కొత్త సినిమాలోనూ అలాంటి రోల్ చేస్తోంది.

హీరోయిన్ మెటీరియల్ లాంటి ఈ బ్యూటీకి చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి.









