
మన ప్రమేయం లేకుండా జరిగే తప్పిదాలు జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి.

టాలీవుడ్ హీరోయిన్‌కి కూడా కెరీర్ పీక్ స్టేజీలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.

కన్నడ బ్యూటీ నభా నటేశ్‌కి అయిన ప్రమాదం.. ఆమె సినీ కెరీర్ గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది.

ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నభా నటేశ్ పుట్టినరోజు నేడు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాతో హీరోయిన్ అయింది. అలా రెండేళ్లు కన్నడలోనే నటించింది.

ఆ తర్వాత అంటే 2018లో తెలుగులోకి నభా నటేశ్ ఎంట్రీ ఇచ్చింది.

తొలి మూవీ 'నన్ను దోచుకుందువటే'తో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఈమెకు బోలెడంత పేరు, మూవీ అవకాశాలు తెచ్చిపెట్టింది.

గ్లామర్, యాక్టింగ్ పరంగా నభా నటేశ్ అవకాశాలు బాగానే వచ్చాయి కానీ ఆ సినిమాలే ఫ్లాప్ అయ్యాయి.

కెరీర్ పరంగా పర్లేదనిపించే స్టేజీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. దాదాపు రెండేళ్ల బెడ్‌కే పరిమితమైంది.

ఈ ఏడాది 'డార్లింగ్' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చింది గానీ పెద్దగా కలిసిరాలేదు.

ప్రస్తుతానికైతే నిఖిల్ పాన్ ఇండియా సినిమా 'స్వయంభు' చేస్తోంది. నభా దీనిపైనే ఆశలన్నీ పెట్టేసుకుంది.


















